
ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలను కరోనా ముప్పతిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యాలు సైతం కుదేల్ అవుతున్నాయి. ముఖ్యంగా మనీ పవర్‌తో గ్లోబ్‌పై ఉన్న దేశాలను శాసించే అమెరికాను కంటికి కనిపించని శత్రువు తీవ్ర స్థాయిలో వణికిస్తోంది. యూరప్ దేశాలు కరోనా దెబ్బకు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. మరోవైపు కరోనా ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కరోనా దెబ్బకు నష్టాలను ఎదుర్కొంటున్న పలు కంపెనీలు.. తమ ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. దీంతో వారు ఉద్యోగం పోయి రోడ్డున పడుతున్నారు.
అయితే ఇలాంటి సమయంలో ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో మొత్తం 17 ఖాళీలను ప్రకటించింది ఎయిర్ ఇండియా. చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, డిప్యూటీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, మేనేజర్, ఆఫీసర్, అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతాలో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జూన్ 18 చివరి తేదీ. అంటే మరి కొన్ని రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది.
ఇక ఈ నోటిఫికేషన్ మొత్తం మొత్తం 17 ఖాళీలు ఉండగా.. అందులో చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్- 1, డిప్యూటీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్- 1, మేనేజర్- 1, ఆఫీసర్- 4 మరియు అసిస్టెంట్- 10 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయస్సు 30 నుంచి 35 ఏళ్లు ఉండాలి. అలాగే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రూ.500 ఫీజు చల్లించాలి. ఇక ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.airindia.in/ వెబ్సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2020 జూన్ 18. కాబట్టి.. అసక్తిగల అభ్యర్థులు వెంటనే నోటిఫికేషన్ మొత్తాన్ని ఓ సారి పరిశీలించి దరఖాస్తు చేసుకోండి.