మొదటి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు, బీజేపీ ప్రతి విషయంలోనూ అనుమానంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. జగన్ తమ మిత్రుడు అంటూ ఒక పక్క చెబుతూనే, మరోపక్క ఆయనపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. అలాగే జగన్ కు అపాయింట్మెంట్ ఇచ్చినట్టే ఇచ్చి, చివరి నిమిషంలో రద్దు చేస్తూ, అల్లరి అల్లరి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే విధంగా జగన్ తో వ్యవహరిస్తున్న తీరు మరెన్నో అనుమానాలకు కారణం అవుతోంది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీని మించిన స్థాయిలో బిజెపి ఏపీ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ అభాసుపాలు చేసేందుకు ప్రయత్నిస్తూ వచ్చింది. ఎవరు ఎన్ని చేసినా, జగన్ మాత్రం అన్ని ఇబ్బందులను, అన్ని అవమానాలను భరిస్తూనే వస్తున్నారు. 

IHG

 

బిజెపికి అవసరమైన సందర్భంలో మద్దతు ఇస్తూ, కేంద్రంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా జగన్ చూసుకుంటున్నారు. బిజెపి తమను పట్టించుకోకపోయినా, జగన్ మాత్రం బీజేపీ విషయంలో సానుకూలంగానే ఉంటూ వస్తున్నారు. గతంలో జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులు, శాసన మండలి రద్దు, ఏపీ కి ప్రత్యేక హోదా వంటి విషయాల్లో బిజెపి మొదట్లో సానుకూలంగానే వ్యవహరించినట్లు గా కనిపించినా, ఆ తర్వాత వాటిని పట్టించుకోనట్టుగా వ్యవహరించింది. ఇప్పుడు బిజెపికి జగన్ తో చాలా అవసరమే ఉంది. రాజ్యసభ స్థానాలతో పాటు 22 మంది ఎంపీలు ఉండడం, కేంద్రంలో ఏదైనా బిల్లు ప్రవేశపెట్టే సందర్భంలో వైసీపీ మద్దతు అవసరం అవుతూ ఉండటం వంటి కారణాలతో వైసీపీ కి ఈ విషయంలో సానుకూలంగా ఉండాలనే నిర్ణయానికి కేంద్రం వచ్చినట్టుగా తెలుస్తుంది. 

 

IHG

 

అదీ కాకుండా ఈ విషయంలో మోదీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. బిజెపి ప్రభుత్వం ప్రజలకు చెప్పకుండా ఏదో దాస్తోందని, ఇది ప్రజలకు హానికరమైన వ్యవహారమని, కాంగ్రెస్ తో పాటు ఎన్సీపీ, శివసేన పార్టీలు బిజెపి ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ఈ విషయంలో జాతీయ స్థాయిలో పలుకుబడి ఉన్న నాయకులు కూడా సైలెంట్ అయిపోయారు. ఇక జాతీయ మీడియా కూడా మోదీ ప్రభుత్వం ఏదో తప్పు చేస్తోందనే విధంగా కథనాలు ప్రసారం చేస్తున్నాయి. కానీ ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం తరఫున జగన్ సానుకూలంగా స్పందించారు.

 

 ఇప్పుడు రాజకీయాలకు సమయం కాదని, ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ప్రధాని నిర్ణయానికి మద్దతు పలకాల్సిన సమయమని, ఏపీ సీఎం గా బిజెపి ప్రభుత్వానికి తాను మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం స్పష్టంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయకపోవడంతో బిజెపి నాయకులు మధ్య చర్చకు వచ్చిందట. జగన్ విషయంలో మనం వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నా, జగన్ మాత్రం ఎప్పుడూ మనకు మద్దతుగా నిలబడుతున్నదని, జగన్ కు  అన్ని విధాల, సహాయ సహకారాలు అందించాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 

 

ఆర్థికంగా ఇప్పుడు ఏపీకి జగన్ కోరినంత సహాయం చేయలేకపోయినా, మిగతా విషయాల్లో పూర్తిగా సహకరించాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న శాసన మండలి రద్దు బిల్లుపైన నిర్ణయం తీసుకోవాలని, ఆర్డినెన్స్ రూపంలో రద్దు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే కేంద్రానికి ఆర్థిక భారం లేని అన్ని విషయాలపైన జగన్ ప్రభుత్వానికి సహకరించి, జగన్ రుణం తీర్చుకోవాలనే అభిప్రాయం కేంద్ర బిజెపి పెద్దలకు కలిగినట్టుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: