
చైనాలో పుట్టుకొచ్చిన ప్రాణాంతక కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచంలోని అన్ని దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. అగ్ర రాజ్యంగా చెప్పుకునే అమెరికా కరోనా దెబ్బకు చిగురుటాకులా వణికిపోతోంది. ఇక కంటికి కనిపించని కరోనా కారణంగా అన్ని రంగాలు కుదేలైపోతున్నాయి. ఈ క్రమంలోనే అనేక మంది జీవనోపాధిని కోల్పోతున్నారు. ఫలితంగా దేశంలో నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అయితే ఇలాంటి సమయంలో టాటా మెమొరియల్ సెంటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్లో మొత్తం 146 ఖాళీలు ఉన్నాయి. నర్స్, టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్, ఫోర్‌మెన్, అసిస్టెంట్ మెడికల్ సోషల్ వర్కర్, సైంటిఫిక్ ఆఫీసర్, ఆఫీసర్ ఇంఛార్జ్, అసిస్టెంట్ మెడికల్ సోషల్ వర్కర్, సూపర్వైజర్ లాంటి పోస్టులు ఉన్నాయి. వాటి వివరాలు చూస్తే.. మొత్తం ఖాళీలు- 146 ఉండగా.. అందులో సైంటిఫిక్ ఆఫీసర్ డీ (సెంటర్ ఫర్ క్యాన్సర్ ఎడిమమియాలజీ)- 01, సైంటిఫిక్ ఆఫీసర్ డీ (న్యూక్లియర్ మెడిసిన్)- 02,సైంటిఫిక్ ఆఫీసర్ డీ (రేడియోఫార్మసిస్ట్)- 01, సైంటిఫిక్ ఆఫీసర్ డీ (కంప్యూషనల్ ఇమేజింగ్)- 01, సైంటిఫిక్ ఆఫీసర్ డీ (న్యూక్లియర్ మెడిసిన్)- 01, సైంటిఫిక్ ఆఫీసర్ సీ (రేడియోఫార్మసిస్ట్)- 01, సైంటిఫిక్ ఆఫీసర్ సీ (న్యూక్లియర్ మెడిసిన్)- 01, సైంటిఫిక్ ఆఫీసర్ సీ (క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్)- 01,
ఆఫీసర్ ఇంఛార్జ్ (డిస్పెన్సరీ)- 01 పోస్టులు ఉన్నాయి.
వీటిలో పాటు నర్స్ ఏ- 49, జూనియర్ ఇంజనీర్ (బయో మెడికల్)- 01, కిచెన్ సూపర్వైజర్- 01, హౌజ్‌కీపింగ్ సూపర్వైజర్- 01, కోఆర్డినేటర్ బీ- 08,
ఫార్మాసిస్ట్ బీ- 04, టెక్నీషియన్- 04, ఫోర్‌మ్యాన్- 05, సైంటిఫిక్ అసిస్టెంట్ బీ- 58, అసిస్టెంట్ మెడికల్ సోషల్ వర్కర్- 02 మరియు అసిస్టెంట్ డైటీషియన్- 03 పోస్టులు ఉన్నాయి. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి ఆగస్ట్ 7 ఆఖరు తేదీ. ఇక ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://actrec.gov.in/ లేదా https://tmc.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు పూర్తి వివరాలు తెలుసుకుని వెంటనే దరఖాస్తు చేసుకోవలెను.