
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచదేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడో చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంతక మహమ్మారి.. ఇప్పుడు ప్రజలందరికీ గండంగా మారింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు ఎలాంటి మందు లేదు. కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేయాలంటే వ్యాక్సీన్ కనిపెట్టాల్సిన అత్యవసర పరిస్థితి. దీంతో కరోనా వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కాని, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో అర్థం కావడం లేదు.
అయితే ఇదే సమయంలో కరోనా దెబ్బకు ఉపాధి కోల్పోతున్న వారి సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతోంది. అప్పుల భారం తట్టుకోలేని పలు కంపెనీలు తమ ఉద్యోగులకు పీకిపారేస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ ఉద్యోగాలు భర్తీ చేస్తూ.. నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిట్టర్, టర్నర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్లో మొత్తం 290 పోస్టులు ఉన్నాయి. వాటి వివరాలు చూస్తే.. మొత్తం 290 పోస్టుల్లో.. మేట్ (మైన్స్)- 60, బ్లాస్టర్ (మైన్స్)- 100, ఫిట్టర్- 30టర్నర్- 5, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)- 25 పోస్టులు ఉన్నాయి.
వీటితో పాటు ఎలక్ట్రీషియన్- 40, ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 6, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్)- 2, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్)- 6, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 2 మరియు సర్వేయర్- 5 పోస్టులు ఉన్నాయి. విద్యార్హత విషయానికి వస్తే.. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఐటీఐ, డిప్లొమా, బీఈ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. అయితే 18 నుంచి 30 ఏళ్లు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి జూలై 25 ఆఖరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.hindustancopper.com/ వెబ్సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకుని.. ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.