
తాజాగా ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ (రీజనల్ రూరల్ బ్యాంక్స్) 2020 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటన ద్వారా దాదాపు 9698 పీవో, క్లర్క్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. జులై 1, 2020 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. దరఖాస్తుకు చివరితేదీ జులై 21, 2020. ఆసక్తి గల వారు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలు ibps.in వెబ్ సైట్ లో చూడొచ్చు. రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు నోటిఫికేషన్ లో వివరంగా ఇచ్చారు.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా విభాగాల వారీ ఖాళీలు: 9698, ఆఫీస్ అసిస్టెంట్ – 4682, ఆఫీసర్ స్కేల్ I – 3800, ఆఫీసర్ స్కేల్ II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్) – 838, ఆఫీసర్ స్కేల్ II (అగ్రికల్చరల్ ఆఫీసర్) – 100, ఆఫీసర్ స్కేల్ II (IT) – 59, ఆఫీసర్ స్కేల్ II (లా) – 26, ఆఫీసర్ స్కేల్ II (CA) – 26, ఆఫీసర్ స్కేల్ II (మార్కెటింగ్ ఆఫీసర్) – 8, ఆఫీసర్ స్కేల్II (ట్రెజరీ మేనేజర్) – 3, ఆఫీసర్ స్కేల్ III – 156 గా ఉన్నాయి. ఇక ఈ ఉద్యోగాలకొరకు ముఖ్యతేదీలు చూస్తే... దరఖాస్తులు ప్రారంభం: జులై 1, 2020, దరఖాస్తుకు చివరితేదీ: జులై 21, 2020, ఆన్‌లైన్ ఎగ్జామ్స్ (ప్రిలిమినరీ): సెప్టెంబర్/అక్టోబర్ 2020, ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలు: అక్టోబర్, 2020, మెయిన్స్ పరీక్షలు: అక్టోబర్/నవంబర్, 2020.
ఇక ఈ ఉద్యోగాలకు వయసు విషయానికి వస్తే... ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 18 -28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆఫీసర్ స్కేల్- III (సీనియర్ మేనేజర్): 21-40 ఏళ్ల మధ్య ఉండాలి. ఆఫీసర్ స్కేల్- II (మేనేజర్): 21-32 ఏళ్ల మధ్య ఉండాలి. ఆఫీసర్ స్కేల్- I (అసిస్టెంట్ మేనేజర్): 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక జీతం నెలకి రూ.15000 తో రూ. 44000.