
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారితో చేసే యుద్ధంలో ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాక్సిన్‌లేని ఈ ప్రాణాంతక వైరస్ నుంచి ఎప్పుడు బయటపడతామో ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. చైనాలో పుట్టిన కరోనావైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను కమ్మేసి.. అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక ఈ కరోనా వైరస్‌ను నాశనం చేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచంలోని అన్ని దేశాల శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
మరోవైపు కరోనా కారణంగా ఉపాధి దెబ్బతింది.. ఉన్న ఉద్యోగం గ్యారంటీ లేదు.. ఇప్పటికే చాలా మంది నిరుద్యోగులకు మారారు.. ఈ తరుణంలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పారు ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్. విషయం ఏంటంటే.. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫకేషన్‌లో మొత్తం 300 ఖాళీలున్నాయి. షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. వీటి వివరాలు చూస్తే.. మొత్తం షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్ పోస్టులు 300 ఉండగా.. అందులో పురుషులు- 270 మరియు మహిళలు- 30 పోస్టులు ఉన్నాయి.
విద్యార్హత విషయానికి వస్తే ఎంబీబీఎస్ ఉండాలి. అలాగే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2020 డిసెంబర్ 31 నాటికి 45 ఏళ్ల లోపు ఉండాలి. ఈ పోస్టులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ, ఫిజికల్, మెడికల్ రౌండ్ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 ఆగస్ట్ 16 ఆఖరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకుని.. వెంటనే దరఖాస్తు చేసుకోవలెను. కాగా, ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.amcsscentry.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది