స్టాఫ్ సెలక్షన్ కమిటీ (ssc) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. మీలో ఎవరికైనా పోలీస్ ఉద్యోగం చేయాలని కల ఉందా...? పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా...? అయితే ఈ నోటిఫికేషన్ మీకోసమే. స్టాఫ్ సెలక్షన్ కమిటీ త్వరలోనే భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ఏకంగా 5846 ఉద్యోగాలకు ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయుటకు కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇక పోస్టులను భర్తీ చేయడం కోసం ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కు ఓ లేఖ రాశారు. దీని ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమిటీ 5 వేల ఉద్యోగాలకు పైగా నోటిఫికేషన్ ను అవకాశం లేకపోలేదు. అయితే ప్రస్తుతానికి 1564 పోలీస్ పోస్టులకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇది ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్, ఇన్‌స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితో పాటు అతి త్వరలో మిగతా పోస్టుల భర్తీకి కూడా కొత్త నోటిఫికేషన్ రాబోతోంది.
తాజా వివరాల కోసం ఎప్పటికప్పుడు https://ssc.nic.in వెబ్ సైట్ ను ఫాలో అవ్వాల్సి ఉంది. ప్రస్తుతానికి స్టాఫ్ సెలక్షన్ కమిటీ రిక్రూట్మెంట్ 2020 నోటిఫికేషన్ ఖాళీల వివరాలు చూస్తే... మొత్తం ఖాళీలు 5846 ఉండగా అందులో కానిస్టేబుల్ పురుషులకు 3433 పోస్ట్ లు, కానిస్టేబుల్ ఎక్స్ సర్వీస్‌మెన్ పురుషులు 226 పోస్ట్ లు, కానిస్టేబుల్ ఎక్స్ సర్వీస్‌మెన్ కమాండో పురుషులు 243 పోస్ట్ లు, కానిస్టేబుల్ మహిళలు 1944 భర్తీ చేయనున్నారు.