
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో జూలై 25వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆవిశేషాలు మీకోసం
ముఖ్య సంఘటనలు
1804: హైదరాబాదులో మీర్ ఆలం టాంక్ నిర్మాణం ప్రారంభమయ్యింది
1977: భారత రాష్ట్రపతిగా బి.డి.జట్టి పదవీ విరమణ.
1977: భారత రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి పదవిని స్వీకరించాడు.
1978: లండన్ లో తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్ జన్మించింది
1981: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము స్థాపించబడింది.
1982: భారత రాష్ట్రపతిగా జ్ఞాని జైల్ సింగ్ పదవిని స్వీకరించాడు.
1987: భారత రాష్ట్రపతిగా జ్ఞాని జైల్ సింగ్ పదవీ విరమణ
1987: భారత రాష్ట్రపతిగా ఆర్.వెంకటరామన్ పదవిని అధిష్టించాడు.
1992: భారత రాష్ట్రపతిగా శంకర దయాళ్ శర్మ పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
1997: భారత రాష్ట్రపతిగా కె.ఆర్.నారాయణన్ పదవిని స్వీకరించాడు.
2002: భారత రాష్ట్రపతిగా ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
2007: భారత రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ పదవిని స్వీకరించింది.
2009 : దేశంలో ఆర్థిక విలువ గణనీయంగా పెరిగింది .
జననాలు
1901: కలుగోడు అశ్వత్థరావు, స్వయంకృషితో తెలుగు కన్నడ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. (మ.1972)
1935: కైకాల సత్యనారాయణ, తెలుగు సినీ నటుడు.
1952: లోకనాథం నందికేశ్వరరావు, నాలుగు దశాబ్దాలుగా మిమిక్రీ, వెంట్రిలాక్విజం ప్రదర్శనలలో తనదైన గుర్తింపును స్వంతం చేసుకున్నారు
1955: చెల్లమెల్ల సుగుణ కుమారి, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం నుండి 12వ లోకసభ తెలుగుదేశం పార్టీ సభ్యురాలిగా పోటీచేసి, గెలిచి భారత పార్లమెంటులో ప్రవేశించింది
1978: లూయీస్ బ్రౌన్, తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ .
1984: నారా రోహిత్,సినీ నటుడు, నిర్మాత
మరణాలు
1909: అమ్మెంబాల్ సుబ్బారావు పాయ్, భారత్‌లోని ప్రఖ్యాత బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంకుతో పాటు మంగళూరులోని కెనరా ఉన్నత పాఠశాల స్థాపకుడు. (జ.1852)
2009: జస్టిస్ అమరేశ్వరి, భారతదేశములో తొలి మహిళా న్యాయమూర్తి. (జ.1928).
2015: చలసాని ప్రసాద్, విరసం వ్యవస్థాపక సభ్యుడు, హేతువాది (జ.1932).
2019: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ తెలుగు కవి, రచయిత, ఆకాశవాణి కళాకారుడు. (జ.1944)