విద్యార్థులకు ఎడ్యుకేషన్ లో సరైన గైడెన్స్ ఇచ్చేవారు లేక ఏదేదో చదివేస్తారు. విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వారికీ ఎక్కువ డిమాండ్ ఉండే కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఏఐసీటీఈ, జేఎన్టీయూ యోచిస్తున్నాయి. అయితే విద్యార్థులు అధిక డిమాండ్ ఉన్న కోర్సులు అందించడం వలన సమాజంలో వారికీ మంచి గుర్తింపును ఏర్పచుకోవడానికి దోహదపడుతాయి. విద్యార్థులకు నాణ్యతమైన విద్యను అందించడానికి ఏఐసీటీఈ, జేఎన్టీయూ ఆలోచిస్తున్నాయి.
అయితే ప్రస్తుతం ఉన్న కోర్సుల్లో డేటా సైన్స్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), రోబోటిక్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ) వంటి ఎమర్జింగ్ టెక్నాలజీ కోర్సులకు భారీ డిమాండ్ ఉంది. అయితే 60-70 శాతం మంది విద్యార్థులు కూడా ఈ కోర్సులవైపే అడుగులు వేస్తున్నారు. దీంతో వివిధ విద్యా సంస్థలు కూడా వీటి నిర్వహణకే దోహదపడుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు కోర్ బ్రాంచీలుగా ఓ వెలుగు వెలిగిన సివిల్, ఎలక్ర్టికల్, మెకానికల్ విభాగాలు క్రమంగా ప్రాధాన్యాన్ని కోల్పోతున్నాయని నిపుణులు తెలిపారు.
అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ కోర్సులను పలు కాలేజీలు పూర్తిగా, కొన్ని 50 శాతం వరకూ రద్దు అయ్యాయి. ఏఐసీటీఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 204 ఇంజనీరింగ్ కళాశాలల్లో దాదాపు 17 వేలకు పైగా సీట్లు సీఎస్ ఎమర్జింగ్ టెక్నాలజీ కోర్సుల్లో మార్చుకునేందుకు ఏఐసీటీఐకి దరఖాస్తు చేసుకుని అనుమతులు కూడా పొందుతున్నాయి. ఏఐసీటీఈ సైతం ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే కోర్సులకే పెద్దపీట వేయాలని నిర్ణయించింది.
అంతేకాక తెలంగాణలో ఈ ఏడాది నూతనంగా 5 ప్రైవేట్ వర్సిటీలను ప్రారంభించారు. వీటిలో మేడ్చల్ జిల్లాలోని మల్లారెడ్డి వర్సిటీ, అనురాగ్ వర్సిటీ, వరంగల్ ఎస్ఆర్, హైదరాబాద్‌లోని మహీంద్ర, మెదక్‌లోని ఓక్సిన్ వర్సిటీలు ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరంలో ఇవి అందించే ఇంజినీరింగ్ కోర్సుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండ్ యానిమేషన్, బిజినెస్ సిస్టమ్స్, ఐవోటీ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీ కోర్సులే ఉండటం విశేషమని నిపుణులు తెలిపారు.