గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో జూలై 29వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం
ముఖ్య సంఘటనలు
1957: అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఏర్పాటైంది.
1976: వరంగల్లులో కాకతీయ విశ్వవిద్యాలయమును నెలకొల్పారు.
2015: ముబై పేలుళ్ల కేసులో 257 మంది మృతికి కారకుడైన యాకుబ్ మెమన్ను నాగపూరు జైలులో ఉరి తీశారు.
జననాలు
1883: ముస్సోలినీ, ఇటలీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు. (మ.1945).ముస్సోలినీ 1883లో ఇటలీలో ఫోర్లీ అను చోట ఒక కమ్మరి కుటుంబములో జన్మించాడు.ముస్సోలినీ తండ్రి కమ్మరి, సామ్యవాది. విద్యార్థిదశలోనే రాచరిక సర్వాధికారాన్ని ప్రబోధించు గ్రంథములను చదివి విప్లవ సామ్యవాదిగా మారాడు.కొతకాలము తర్వాత సోషలిస్టు పత్రికైన అవంత్ కు సంపాదకత్వం వహించాడు.మొదటగా ఉపాధ్యాయునిగా తన జీవితం ఆరంభించినప్పటికి తరువాత ముస్సోలినీ సామ్యవాద సిద్ధాంతాలను స్విట్జర్లాండ్,ఆస్ట్రియా,ఇటలీ లలో ప్రచారం చేసాడు.
1904: జె.ఆర్.డి.టాటా, పారిశ్రామికవేత్త, తొలి విమాన చోదకుడు (మ.1993)
1931: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గేయరచయిత, సాహితీవేత్త, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (మ.2017)
1975: కృష్ణుడు (నటుడు), తెలుగు సినీ నటుడు.
1975: లంక డిసిల్వా, శ్రీలంకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు.
మరణాలు
1890: విన్సెంట్ వాన్ గోహ్, డచ్ చిత్రకారుడు. (జ.1853)
1891: ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బెంగాలీ కవి, విద్యావేత్త, తత్త్వవేత్త, పారిశ్రామిక వేత్త, రచయిత, అనువాదకుడు, సమాజ సేవకుడు. (జ.1820)
1931: బిడారం కృష్ణప్ప, తాళబ్రహ్మ, గాన విశారద. (జ.1866)
1996: అరుణా అసఫ్ ఆలీ, భారత స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు. (జ.1909)
2012: వెంపటి చినసత్యం, కూచిపూడి నాట్యాచార్యుడు (జ.1929)
2019: కె.బి.లక్ష్మి తెలుగు రచయిత్రి, పాత్రికేయురాలు. (జ.1953)
2019: ముఖేష్ గౌడ్, హైదరాబాదుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు. మాజీమంత్రి (జ.1959)
పండుగలు , జాతీయ దినాలు
అంతర్జాతీయ పులుల దినోత్సవం (2010)
ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ డే.