ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఉద్యోగాలు భర్తీ చేస్తూ.. నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీర్, అసిస్టెంట్ కెమిస్ట్ లాంటి పోస్టులున్నాయి. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో బీటెక్ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఇక ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 275 ఖాళీలు ఉన్నాయి. అందులో ఇంజనీర్ 250 ఉండగా.. అసిస్టెంట్ కెమిస్ట్ 25 పోస్టులున్నాయి. విద్యార్హత విషయానికి వస్తే.. ఇంజనీర్ పోస్టుకు ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ కనీసం 60 శాతం మార్కులతో పాస్ అయ్యి ఉండాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే స్టాట్ అయింది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 31 చివరి తేదీగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అంటే నేడు, రేపు.. రెండు రోజులు మాత్రమే దరఖాస్తు గడువు మిగిలి ఉంది. కాబట్టి, ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలను తెలుసుకుని.. వెంటనే దరఖాస్తు చేసుకోవలెను. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేస్తే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.300 ఫీజు చల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఎలాంటి ఫీజు లేదు. కాగా, ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్ https://ntpccareers.net/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు.