1857వ సంవత్సరంలో భారత దేశ విద్యా విధానాన్ని బ్రిటిష్ వారు మార్చారు. అప్పట్లో భారతీయ విద్యార్థులు అందరూ ఆంగ్ల బాషా నేర్చుకోవాలని వారు పెట్టిన నిబంధన కేవలం వారి స్వప్రయోజనాల కోసమే అని తెలుస్తోంది. ఆంగ్లం సరిగ్గా తెలిసిన వారైతే వారు చెప్పే మాటలను అర్థం చేసుకొని వారికి అన్ని పనులు చేయగలరని అప్పట్లో బ్రిటిష్ వారు భారతీయ ప్రజలు అందరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలని నిబంధన పెట్టారు. అయితే 1857వ సంవత్సరంలో ప్రవేశ పెట్టిన భారతీయ విద్యా విధానంలో చిన్నపాటి మార్పులు చోటు చేసుకున్నాయి కానీ పూర్తిస్థాయిలో 2020 సంవత్సరం వరకు చోటు చేసుకోలేదు.


అయితే బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన భారతీయ విద్యా విధానం ఎలా మార్చాలి? విద్యార్థులకు సమర్థవంతంగా విద్య ఎలా అందించాలనే అంశాలు 2020 నూతన విద్యా విధానం లో సమగ్రంగా ఉన్నాయి. పాఠశాల అంటే ఏంటో కూడా తెలియని కోట్లమంది పిల్లలను విద్యా శ్రవంతి లోకి తీసుకు రావడం... వృత్తి విద్యలను కూడా చదువులో తప్పనిసరి భాగం చేయడం వంటి అంశాలు మెచ్చుకోదగినవి. ఎవరికీ ఉపయోగం లేని సిలబస్ తగ్గించి అసలైన జ్ఞానం బోధించే విధంగా ప్రణాళిక రూపొందించడం... పర్యావరణ శుభ్రత పై దృష్టి సారించే విధంగా పాఠశాలలో సరికొత్త సబ్జెక్ట్ ని తీసుకు రావడం... నైతిక విలువల ప్రమాణాల ప్రతి విద్యార్థి తెలుసుకోవడం కోసం ప్రత్యేకమైన సబ్జెక్టుని బోధించడం వంటివి నూతన విద్యా విధానంలో పొందుపరిచారు.


ప్రాథమిక పాఠశాల స్థాయి నుండే మానవీయ, రాజకీయ అంశాలపై అవగాహన కల్పించే విధంగా విద్యార్థులకు సరికొత్త బోధనా విధానం కూడా గొప్ప ఊరట కలిగిస్తుంది. విద్యారంగంపై భారతదేశం జీడీపీ లో 4.3 నుండి 6 శాతం వరకు పెంచేందుకు మోడీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఫలితంగా ప్రతి పాఠశాలలో టెక్నాలజీ గురించి అవగాహన కల్పించేందుకు అనేక మౌలిక సదుపాయాలు సమకూర్చబడతాయని అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: