
న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్‌తో పాటు అన్ని రాష్ట్రాల్లోని ఎయిమ్స్‌లో ఈ ఖాళీలున్నాయి. ఏపీలోని మంగళగిరిలో గల ఎయిమ్స్‌లో 140 ఖాళీలున్నాయి. తెలంగాణలో మాత్రం పోస్టులు లేవు. ఇక పోస్టుల పూర్తి వివరాలు చూస్తే.. మొత్తం 3803 పోస్టులు ఉండగా అందులో ఎయిమ్స్ న్యూఢిల్లీ- 597, ఎయిమ్స్ బఠిండా- 600, ఎయిమ్స్ డియోగఢ్- 150, ఎయిమ్స్ రిషికేష్- 300, ఎయిమ్స్ మంగళగిరి- 140, ఎయిమ్స్ గోరఖ్‌పూర్- 100, ఎయిమ్స్ జోధ్‌పూర్- 176, ఎయిమ్స్ కళ్యాణి- 600, ఎయిమ్స్ నాగ్‌పూర్- 100, ఎయిమ్స్ పాట్నా- 200, ఎయిమ్స్ రాయ్‌పూర్- 246, ఎయిమ్స్ రాయ్ బరేలీ- 594 పోస్టులు ఉన్నాయి.
విద్యార్హత విషయానికి వస్తే.. బీఎస్సీ నర్సింగ్ / బీఎస్సీ నర్సింగ్ / బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికెట్) / పోస్ట్ బేసిక్ బీఎస్సీ / డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ ఉండాలి. అలాగే 50 పడకల ఆస్పత్రిలో కనీసం రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉంటే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలంటే.. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1500 ఫీజు చల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1200 చల్లించాలి. దివ్యాంగులకు మాత్రం ఎలాంటి ఫీజు చల్లించాల్సిన పనిలేదు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి 2020 ఆగస్ట్ 18 చివరి తేదీగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబధించిన పూర్తి వివరాలను https://www.aiimsexams.org/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకుని.. వెంటనే దరఖాస్తు చేసుకోవలెను.