వీటి పూర్తి వివరాలు చూస్తే.. మొత్తం 1522 ఖాళీల్లో డ్రైవర్- 574, ల్యాబ్ అసిస్టెంట్- 21, వెటర్నరీ- 161, ఆయా (మహిళలు)- 5, కార్పెంటర్- 3, ప్లంబర్- 1, బార్బర్ మేల్- 75, బార్బర్ ఫీమేల్- 12, సఫాయివాలా మేల్- 89, సఫాయివాలా ఫీమేల్- 28, వాటర్ క్యారియర్ మేల్- 101, వాటర్ క్యారియర్ ఫీమేల్- 12, వెయిటర్ మేల్- 1, పెయింటర్- 12, టైలర్- 20, కోబ్లర్- 20, గార్డెనర్- 9, కుక్ మేల్- 232, కుక్ ఫీమేల్- 26, వాషర్‌మ్యాన్ మేల్- 92 మరియు వాషర్‌మ్యాన్ ఫీమేల్- 28 పోస్టులు ఉన్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
వేతనం విషయానికి వస్తే.. రూ.21700 నుంచి రూ.69100 వరకు లభిస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే.. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 ఫీజలు చల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలు మాత్రం ఎలాంటి ఫీజు చల్లించాల్సిన అవసరం లేదు. కాగా, ఈ పోస్టులకు త్వరలో సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) అధికారిక వెబ్సైట్ http://www.ssbrectt.gov.in/ లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్లో విడుదలవుతుంది. ప్రకటన విడుదలైన ముప్పై రోజుల్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కాబట్టి, కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాలు కోరుకునేవారు ఈ అద్భుత అవకాశాన్ని అస్సలు మిస్ కాకండి.