అవును మీరు విన్నది నేను అన్నది నిజమే..
హైదరాబాద్ డీ.ఆర్.డీ.ఓ లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అభ్యర్థులు
2020 సెప్టెంబర్ 12 లోగా దరఖస్తు చేయాలి. అయితే అది కూడా పరీక్ష లేకుండా.. ఇక ఆ సంగతులేంటో ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం..
.jpeg)
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబరేటరీ-DLRL కోసం పలు పోస్టుల్ని భర్తీ చేస్తోంది డీఆర్‌డీఓ.
జూనియర్ రీసెర్చ్ ఫెలో-JRF పోస్టుల్ని ప్రకటించింది. మొత్తం 10 ఖాళీలున్నాయి. ఇవి రెండేళ్ల కాలానికి భర్తీ చేస్తున్న పోస్టులు. అవసరాన్ని బట్టి గడువును పొడిగించే అవకాశముంది. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది డీఆర్‌డీఓ. అయితే దరఖాస్తుకు సంబంధించిన విషయాలు ఎలా తెలుసుకోవాలి అంటే.. https://www.drdo.gov.in/ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

అయితే ఆ జాబ్స్ డీటైల్స్ మీకోసం:
మొత్తం ఖాళీలు: 10
జూనియర్ రీసెర్చ్ ఫెలో (ఈసీఈ): 7
జూనియర్ రీసెర్చ్ ఫెలో (ఎంఈ): 3దరఖాస్తుకు చివరి తేదీ:
2020 సెప్టెంబర్ 12
జీతం: రూ.31,000

అర్హతలు:సంబంధిత బ్రాంచ్‌లో బీఈ లేదా బీటెక్ ఫస్ట్ డివిజన్‌లో పాస్ కావాలి. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా గేట్ పరీక్ష పాస్ కావాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్
డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్స్ (ఎంఈ లేదా ఎంటెక్) ఫస్ట్ డివిజన్‌లో పాస్ కావాలి. వయస్సు 28 ఏళ్ల లోపు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు,
ఎస్సీ,
ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్:
The
director,
Defense Electronics Research Laboratory (DLRL),
Ministry of Defence,
DRDO Chandrayangutta Lines,
Hyderabad- 500005,
Telangana.