దేశవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలను కోల్పోయారు. మరికొంత మంది ఈ మహమ్మారి కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ కారణంగా చాల మంది జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. ఉన్నత చదువులు చదివిన జాబ్స్ లేక చాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఉపాధ్యాయ వృత్తి చేపట్టినవారికి శుభవార్త. నవోదయ విద్యాలయ సమితి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

పుణెలోని నవోదయ విద్యాలయ సమితి రీజనల్ ఆఫీస్ 454 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మహారాష్ట్ర, గుజరాత్, గోవా, డామన్ అండ్ డయ్యూ, దాద్రా అండ్ నగర్ హవేలీ రాష్ట్రాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయాలని చూస్తుంది. ఇక ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్-TGT, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్-PGT, ఫ్యాకల్టీ కమ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్-FGSA లాంటి పోస్టుల్ని భర్తీ చేయడానికి సిద్ధమైంది నవోదయ విద్యాలయ సమితి.

అయితే ఈ నోటిఫికేషన్ లో మొత్తం 454 ఖాళీలు ఉన్నాయి. అయితే అందులో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT)- 98, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT)- 293, ఫ్యాకల్టీ కమ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ (FGSA)- 73 పోస్టులు ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు. ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 11 లోగా ఇమెయిల్ ద్వారా దరఖాస్తు చేయాలని తెలిపారు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయని పేర్కొన్నారు. ఇక నోటిఫికేషన్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధంచిన పూర్తి వివరాలను https://navodaya.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుకోవచ్చునని అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: