తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా-BOI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో స్కేల్ 4 వరకు వేర్వేరు పోస్టుల్ని భర్తీ చేస్తోందని వెల్లడించారు. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తం 214 ఖాళీలున్నాయని తెలియజేశారు. ఈ నోటిఫికేషన్ లో ఎకనమిస్ట్, స్టాటిస్టీషియన్, క్రెడిట్ అనలిస్ట్, క్రెడిట్ ఆఫీసర్ లాంటి పోస్టులున్నాయని పేర్కొన్నారు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 సెప్టెంబర్ 16న ప్రారంభం కానుందని తెలిపారు. ఇక నోటికేషన్ అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 30 చివరి తేదీ అని వెల్లడించారు. దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారని తెలిపారు.
అయితే ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://bankofindia.co.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చునని అధికారులు వెల్లడించారు. మొత్తం 214 ఖాళీలు ఉండగా అందులో ఎకనమిస్ట్- 4, స్టాటిస్టీషియన్- 2, రిస్క్ మేనేజర్- 9, క్రెడిట్ అనలిస్ట్- 60, క్రెడిట్ ఆఫీసర్- 79, ఐటీ (ఫిన్‌టెక్)- 30, ఐటీ (డేటా సైంటిస్ట్)- 3, ఐటీ (డేటా అనలిస్ట్)- 9, ఐటీ (ఇన్ఫో సెక్యూరిటీ)- 8, టెక్ అప్రైజల్- 10 పోస్టులున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175ని తెలిపారు. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పోస్టులకు ఆన్‌లైన్ ఎగ్జామ్ త్వరలో తేదీ తెలియజేస్తుందని తెలిపారు.