
ఇక వాస్తవానికి మే 31నే సివిల్ సర్వీసెస్ పరీక్షలు జరగాల్సి ఉండేదని అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆ పరీక్షలను అక్టోబరు 4కు వాయిదా వేశారు. ఐతే ప్రస్తుతం భారీగా కరోనా కేసులు నమోదవుతుండడం, దేశవ్యాప్తంగా వరదల నేపథ్యంలో.. సివిల్ సర్వీసెస్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ 20 మంది అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సివిల్ సర్వీసెస్ పరీక్షను జేఈఈ, నీట్ వంటి పరీక్షలతో పోల్చకూడదని తెలిపారు. ఆ పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోయే అవకాశముంటుందని, కానీ సివిల్ సర్వీసెస్ పరీక్షలను వాయిదా వేస్తే అలా పరిస్థితేమీ ఉండదని పిటిషన్‌లో పేర్కొన్నారు. కొన్నాళ్లు వాయిదా వేసినంత మాత్రాన ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేశారు.
అంతేకాదు కోవిడ్ పరిస్థితుల్లో పనిభారం కారణంగా సివిల్ సర్వీస్ పరీక్షలకు సరైన విధంగా సన్నద్ధం కాలేకపోతున్నాడని పేర్కొన్నారు. ఇక సెలవులు పెట్టి పరీక్షలను ప్రిపేర్ అయ్యే పరిస్థితి కూడా లేదని వాపోతున్నారు. కానీ మిగతా వారు మాత్రం ఇళ్లల్లో కూర్చొని పరీక్షలను సన్నద్ధమవుతున్నారని తెలిపారు. ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తే తమ కుమారుడిలాంటి వారు ఎంతో మంది నష్టపోయే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో పరీక్షలను కొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు. కానీ కోర్టు మాత్రం పరీక్షలను వాయిదా వేసేందుకు అంగీకరించలేదు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షలను నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.