మరోసారి నిరుద్యోగులకు శుభవార్త తెలియజేసింది డిఆర్డిఓ. డిఆర్డిఓ కు చెందిన సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబరేటరీ ఈ విభాగంలో 12 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఈ నోటిఫికేషన్ లో రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు భర్తీ చేయబోతుంది. దేశంలో వేరు వేరు ప్రాంతాలలో ఈ పోస్టుల భర్తీ నిర్వహించబోతున్నారు. ఈ పోస్టులకు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. కొన్ని పోస్టులు హైదరాబాదులోని డిఆర్డిఓ కేంద్రంలో కూడా భర్తీ చేపట్టబోతున్నారు.


ఇక నోటిఫికేషన్  ప్రకారం వివిధ పోస్టులకు వివిధ విద్య అర్హతలు ఉన్నాయి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే.. ఈ వెబ్ సైట్ ను సంప్రదించండి. అలాగే ఆసక్తి అర్హత గల అభ్యర్థులు hrd@sspl.drdo.in మెయిల్ ఐడీకి మెయిల్ పంపించి ధరఖాస్తు ఫామ్ ను పొందవచ్చు. ఆ దరఖాస్తు ఫామ్ ను డౌన్లోడ్ చేసుకొని అందులోని వివరాలను పూర్తి చేసి మళ్లీ అదే మెయిల్ ఐడికి తిరిగి పంపాల్సి ఉంటుంది. ఇక పోస్ట్ వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి.  జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ 10 పోస్టులు, రీసెర్చ్ అసోసియేట్ 2 పోస్టులను మాత్రమే భర్తీ చేయనున్నారు.
ఒక పోస్టుకు సంబంధిత విద్య అర్హతల వివరాల విషయానికి వస్తే.. రీసెర్చ్ అసోసియేట్ పోస్టుకు ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, మెటీరియల్ సైన్స్‌ విభాగం లో పీహెచ్‌డీ లేదా తత్సమాన పరీక్ష పాస్ అయ్యిండాలి. అలాగే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టుకు ఫిజిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్‌ లో పాస్ కావాలి. వీటితోపాటుగా కచ్చితంగా నెట్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఆసక్తి అర్హత గల అభ్యర్థులకు వయసు వయోపరిమితి 28 - 35 సంవత్సరాల లోపు ఉండాలి. ఎంపిక విధానం విషయానికి వస్తే డిఆర్డిఓ కేంద్రంలో ఇంటర్వ్యూ లేదా ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించి పోస్టులను భర్తీ చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: