దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక పాఠశాలల్లో ఆరు, తొమ్మిదో త‌ర‌గ‌తి(బాలురు) ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే అఖిల భారత సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష 2021-22 ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. ప్రస్తుతం 5, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, మెడికల్‌ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్‌ 19 దరఖాస్తుకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://aissee.nta.nic.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ముఖ్య సమాచారం:

  • # పరీక్ష పేరు: అఖిల భార‌త సైనిక స్కూల్‌ ప్ర‌వేశ ప‌రీక్ష ‌(ఏఐఎస్ఎస్ఈఈ)-2021
  • # అర్హ‌త‌: ప్రస్తుతం ఐదోత‌ర‌గ‌తి చ‌దివే విద్యార్థులు 6వ తరగతికి.. ఎనిమిది చ‌దివే విద్యార్థులు తొమ్మిదో త‌ర‌గ‌తికి ప్ర‌వేశాల‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • # వ‌య‌సు: 31.03.2021 నాటికి ఆరో త‌ర‌గ‌తికి 10 నుంచి 12, తొమ్మిదో త‌ర‌గ‌తికి 13 నుంచి 15 ఏళ్ల మ‌ధ్య ఉన్న బాలురు అర్హులు.
  • # ఎంపిక‌: రాతప‌రీక్ష‌‌, వైద్య ప‌రీక్ష‌ల ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • # ప్ర‌వేశ ప‌రీక్షతేది: జనవరి 10, 2021.
  • # ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • # దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.400, మిగిలిన వారికి రూ.550.
  • # ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: నవంబర్‌ 19, 2020.
  • వెబ్‌సైట్‌:https://aissee.nta.nic.in/

మరింత సమాచారం తెలుసుకోండి: