ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభుత్వం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా ప్రభుత్వాలు పాఠశాలలను పూర్తి మూసివేశారు. ప్రస్తుతం అన్ లాక్ డౌన్ కొనసాగుతుండటంతో మళ్లీ ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలను తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణలో కొన్ని పాఠశాలలు కరోనా నిబంధనలు పాటిస్తూ యధావిధిగా కొనసాగిస్తున్నారు. ఆంధ్రాలో కూడా కొన్ని పాఠశాలలో పై తరగతి విద్యార్థులకు పాఠాలను చెప్తున్నారు. ప్రస్తుతం
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోవడంతో
నవంబర్ రెండోవ తేదీ నుంచి పునః ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.
విద్యార్థుల చదువుతో పాటుగా, వారి ఆరోగ్యం పై
స్కూల్ యాజమాన్యం పూర్తి బాధ్యతను వహించాలని
ఏపి సీఎం
జగన్ మోహన్ రెడ్డి గతంలో చెప్పినట్లు
ఆంధ్ర ప్రదేశ్ విద్యా శాఖ
మంత్రి ఆదిమూలపు సురేశ్ గుర్తు చేశారు.నవంబర్ 2న స్కూళ్లు తెరిచాక నెలపాటు హాఫ్ డే స్కూళ్లు నిర్వహిస్తామని తెలిపారు. కోవిడ్ నుంచి రక్షణకు చర్యలు, ఆరోగ్య పరిరక్షణపై విద్యార్థులకు రోజూ 15 నిమిషాలపాటు టీచర్లు బోధిస్తారని వెల్లడించారు. మిగితా సమయంలో విద్యార్థుల మధ్య సామాజిక దూరాన్ని పాటిస్తూ స్టడీ అవర్స్ పెడతారని చెప్పారు.
ఇకపోతే ఎప్పటిలాగా ఉన్న సెలవులు కాకుండా పాఠ్యాంశాలను పూర్తి చేసే నేపథ్యంలో సెలవులు తగ్గించనున్నట్లు తెలిపారు. అలాగే
సంక్రాంతి, వేసవికి సెలవు రోజులను తగ్గించి స్కూళ్లు నిర్వహిస్తామని చెప్పారు. సెలవు రోజుల్లో విద్యార్థులకు లెర్నింగ్ హవర్స్‌ను కేటాయించి వారు ఇంటి దగ్గరే ఉండి నేర్చుకునేలా పలు రకాల చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం కరోనా ప్రభావం చాలా వరకు తగ్గింది.వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితోపాటు హెడ్‌మాస్టర్లు, టీచర్లనూ అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు. అయితే
స్కూల్ పునః ప్రారంభించిన తర్వాత ఒక నెల రోజుల పాటు మధ్యాహ్నం వరకు మాత్రమే ఉంటాయని, పరిస్థితులను బట్టి సమయాన్ని పొడింగించనున్నట్లు
మంత్రి సురేశ్ వెల్లడించారు.