సైనిక పాఠశాలల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు తాజాగా కేంద్రం వెల్లడించింది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి ఈ రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు భారత రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ ఇటీవల ఓ ప్రకటనలో తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు, జాతీయస్థాయి విద్యా సంస్థల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుండగా, సైనిక పాఠశాలల్లోనూ 27 శాతం సీట్లు కేటాయిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ మేరకు రక్షణ శాఖకు చెందిన సైనిక్ స్కూల్ సొసైటీ పరిధిలో దేశవ్యాప్తంగా 33 పాఠశాలలు ఉన్నట్లు తెలుస్తోంది..
అయితే,
కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించిన ఉత్తర్వుల మేరకు.. 67 శాతం సీట్లను
స్థానిక లేదా
కేంద్ర పాలిత ప్రాంతాల్లోని విద్యార్థులకు ఇవ్వగా, మిగిలిన 33 శాతం ఉన్న సీట్లను ఇతర కేటగిరీ వాళ్లకు కేటాయించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 15 శాతం సీట్లను ఎస్సీలకు, ఎస్టీలకు కేటాయించారు. కాగా, భారత దేశంలో 1961 లో సైనిక పాఠశాలను ప్రారంభించారు.బ్రిటిష్
ఇండియా ‘మార్షల్ రేస్’ విధానం తరువాత ఎన్‌డీఏలో
అఖిల భారతస్థాయి ప్రాతినిధ్యంతో ప్రవేశించేలా బాలలను విద్యాపరంగా, శారీరకంగా, మానసికంగా దృఢంగా చేసేందుకు, విద్యార్థులలో సైనికులుగా మారేందుకు తగిన
శక్తి, సామర్థ్యాలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే ఈ నిర్ణయం పై కొన్ని ప్రాంతాల్లో విమర్శలు ఎదురవుతున్నాయి. కుల , వివక్షత ఉండటం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని తెలుస్తుంది.రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం దీనిని తోసిపుచ్చింది. ఇది విద్యా సంస్థల్లో ప్రవేశాలపై జాతీయ నిబంధనలతో పాటు హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే ఉంటుంది.ఇక్కడ అందరికీ సమాన హక్కులు ఉంటాయి. ఇటీవల వెల్లడైన ఉత్తర్వుల ప్రకారం శిక్షణ ఉంటుందని సైనిక పాఠశాల ప్రిన్సిపాల్ వెల్లడించారు. ఆరో తరగతి నుంచే ఈ పరీక్షలను రాసుకునేందుకు వీలు కల్పించారు.మెరిట్ సాధించిన విద్యార్థులకు మెడికల్ టెస్టుల నిర్వహిస్తున్నట్లు తెలిపారు..