ఏపిలో స్కూల్స్ పునః ప్రారంభించడానికి
ఏపి సర్కార్ కీలక నిర్ణయాలను తీసుకుంది.. ఈ మేరకు ప్రభుత్వం పాఠశాలలకు విజ్ఞప్తి చేసింది..
నవంబర్ 2 నుంచి స్కూల్స్ ఓపెన్ చేసే విధంగా అన్ని చర్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాలేజీల ప్రారంభంపై విద్యాశాఖ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఈ మార్గదర్శకాలు వర్తించనున్నాయి...వాటిని సక్రమంగా పాటించక పోతే స్కూల్స్ తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని
ఏపి సర్కార్ హెచ్చరించింది..
నవంబర్ 2 నుంచి స్కూల్స్ ఓపెన్ కానున్నాయని విద్యాశాఖ
మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఈ ఏడాది కొల్పోయిన విద్యా సంవత్సరాన్ని కవర్ చేసుకునేలా సిలబస్ రూపకల్పన చేసినట్లు తెలిపారు. అయితే
నవంబర్ 2 నుంచి 9, 10 తరగతులను ప్రారంభించాలని నిర్ణయించారు.నవంబర్ 16 నుంచి ఇంటర్ ఫస్టియర్ తరగతులు జరుగుతాయి.
నవంబర్ 23వ తేదీ నుంచి 6, 7, 8 తరగతులను ప్రారంభించనున్నాం. వచ్చే నెల 14 నుంచి 1-5 తరగతులు ప్రారంభిస్తాం.
నవంబర్ 2 నుంచి ఆరు వారాల తర్వాత ప్రైమరీ స్కూళ్లు తెరుస్తాం.
నవంబర్ 23 నుంచి రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లను తెరవనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే స్కూల్స్ శానిటైజ్ చేశారు. ఉపాధ్యాయులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మొదటి నెల వరకు ఒంటి పూట బడిని పెట్టి, ఆ తర్వాత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని యదావిధిగా కొనసాగించనున్నట్లు
మంత్రి తెలిపారు.
ఇది ఇలా ఉండగా ఇప్పుడు స్కూల్స్ , కాలేజీలు తీసుకోవాల్సిన గైడ్ లైన్స్ ను ప్రభుత్వం విడుదల చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
వారంలో ఆరు రోజుల పాటు తరగతులు నిర్వహించాలి. ఏ రోజైనా పని దినాల్లో సెలవు ఇవ్వాల్సి వస్తే దానికి బదులుగా రెండో శనివారాలు, ఆదివారాల్లో క్లాసులు నిర్వహించాలి.క్లాస్ రూమ్స్, క్యాంటీన్లు, జిమ్ వంటి ప్రదేశాల్లో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.హాస్టళ్లల్లోనూ
కరోనా వైరస్ నివారణ జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.హాస్టళ్లలో ఒకటో వంతు విద్యార్ధులను మాత్రమే అనుమతించాలి.
కామన్ హాల్స్,
టీవీ హాళ్లను వసతి కోసం వివియోగించుకోవాల ని తెలిపారు.ప్రతి ఒక్కరూ మాస్కు ధరించేలా, సామాజిక దూరం పాటించేలా చూడాలి.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కరోనా నిబంధనలను పాటించాలని కోరారు..