ఏపి లో స్కూల్స్ , కాలేజీలు నిన్న నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే.. ఈ మేరకు విద్యార్థులు భారీ సంఖ్య లో హాజరయ్యారు. అయితే విద్యార్థులు తరగతులు కూడా వచ్చి శ్రద్ద గా వింటున్నారని పాఠశాల యాజమాన్యాలు వెల్లడించారు. ప్రస్తుతానికి ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం.. ప్రైవేట్ పాఠశాలలకు మాత్రం గట్టి షాక్ ఇచ్చింది. ప్రైవేట్ స్కూళ్ల ఆగడాలకు చెక్ పెడుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్ధులు.. ప్రభుత్వ బడుల లో చేరాలంటే ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ అవసరం లేదని స్పష్టం చేసింది.




కేవలం తల్లిదండ్రుల అంగీకార పత్రం ఉంటే చాలని పేర్కొంటూ.. ఆదేశాలు జారీ చేసింది.. కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న పిల్లల తల్లి దండ్రులకు ఫీజుల పేరుతో ఊరికే భాదిస్తున్నారని తెలియడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. ఏది ఏమైనా కూడా తమకు మాత్రం ఫీజులు చెల్లించాల్సిందేనంటూ ప్రైవేట్ స్కూల్స్ ఒత్తిడి చేస్తున్నాయి. పాత ఫీజులు చెల్లిస్తేనే కొత్త తరగతులకు కూర్చోబెడతామని హెచ్చరించే స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి పరిణామాలు జనాలు ఎదుర్క్కోకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది..



రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ స్కూల్స్‌కు ధీటుగా సర్కారీ బడులను ఏపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, నాడు-నేడు వంటి విప్లవాత్మక పథకాల తో పాటుగా, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంను అమలు చేయడానికి కూడా సిద్దమవుతోంది. అలాగే ప్రభుత్వ పాఠశాల లో చదువుతున్న విద్యార్ధులకు అమ్మఒడి పధకం ద్వారా ఆర్ధిక సాయాన్ని అందిస్తోంది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించడానికి మక్కువ చూపిస్తారని ప్రభుత్వ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం మాత్రం ప్రైవేట్ పాఠశాలలకు మింగుడు పడనవ్వలేదు..


మరింత సమాచారం తెలుసుకోండి: