ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే సాంకేతిక విద్యా సంస్థల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలని సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు అధికారులు నిర్ణయించారు. అందుకోసం నవంబర్ 16 నుంచి కౌన్సిలింగ్ జరిపించెలా షెడ్యుల్ ను విడుదల చేసింది. దేశంలో ఉన్న ప్రముఖ కాలేజీలలో సీట్లను కేటాయిస్తారు.. వివరాల్లోకి వెళితే.. దేశంలోని జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐ ప్రవేశాలకు జాయింట్ సీట్ అలకేషనల్ అథారిటీ గత నెల 6 నుంచి ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఆరు విడతల్లో నిర్వహించింది.. ఈ మేరకు ఆరో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను ఈ నెల 7 న ప్రకటించిన విషయం తెలిసిందే..
ఈ కౌన్సిలింగ్ ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు ఈ రోజు నుంచి శనివారం అంటే నవంబర్ 13 వ తేదీ లోపు జోసా పోర్టల్ ద్వారా ప్రవేశాల ఫీజును కొంత మొత్తం చెల్లించి సీట్లు ఖరారు చేసుకోవాలని జోసా వెల్లడించింది. ఆ కౌన్సెలింగ్ తరువాత ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐలలో మిగిలిన సీట్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సీఎస్‌ఏబీ షెడ్యూల్ జారీ చేసింది. ఇకపోతే ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకుంది.. ఉన్నత చదువులు చదవాలని అనుకునేవారు కళను నెరవేర్చేందుకు మరికొంత మంది విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపింది..