ఏపి లో విద్యార్థులు ఇప్పుడు క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా ఉన్నారు. నవంబర్ 2 నుంచి స్కూల్స్ కాలేజీలు ఓపెన్ అయిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత కోర్సులకు పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు పరీక్షలు కూడా పూర్తయ్యాయి. వాటి ఫలితాలు, మొదలగునవి విడుదల చేశారు. ఎంసెట్, సేసెట్, ట్రిపుల్ ఐటీ, వైద్య విద్యకు సంబందించిన కోర్సుల మరియు వాటి కౌన్సిలింగ్, కోర్సులను పూర్తి చేశారు..




ఇకపోతే ఏపి లో ఈసేట్ పరీక్ష ఫలితాలను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే.. అయితే, ఈ కౌన్సిలింగ్ సంబందించిన తేదీని విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు వాయిదా వేస్తుందని సమాచారం.. ఏపీఈసెట్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ గడువును మరో సారి పొడిగిస్తూ కన్వీనర్‌ ఎం.ఎం. నాయక్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు, విద్యార్హత సర్టిఫికెట్స్‌ పరిశీలన, కాలేజీల, కోర్సుల ఎంపిక, ఆప్షన్లకు న‌వంబ‌రు 11 వరకు అవకాశం కల్పించారు. 13న సీట్లను కేటాయించనున్నారు. ఎన్‌సీసీ, మాజీ సైనిక కోటా, దివ్యాంగులు, స్పోర్ట్స్‌ కోటా సర్టిఫికెట్స్‌ పరిశీలనకు హాజరుకాని వారికి విజయవాడ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ సహాయ కేంద్రంలో హాజరయ్యేందుకు వీలుగా అవకాశం కల్పించారు..




మరో విషయమేంటంటే.. ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు ఆ తర్వాత విద్యకు సంబందించిన కోర్సులను కొనసాగించేందుకు వీలుగా కల్పించేందుకు వీలుగా ఈ ఈసెట్ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే..  సెప్టెంబర్‌ 14న రాష్ట్రంలోని 79 కేంద్రాల్లో ఆన్‌లైన్‌ ద్వారా ఈ పరీక్షలు నిర్వహించారు. 31,891 మంది పరీక్షలకు హాజరుకాగా.. 30,654 మంది క్వాలిఫై అయ్యారు. ఈ ఏడు 97 శాతం క్వాలిఫై అయినట్లు సర్కార్ వెల్లడించింది.. క్వాలిఫై అయినవారిలో 25160 మంది పురుషులు, 6731 మంది మహిళలు ఉన్నారు... ఈ విషయం పై మరోసారి ప్రకటన త్వరలోనే వెలువడనుందని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: