తెలంగాణ లో ఇటీవల జరిగిన పరీక్షలకు సంబందించిన ఫలితాలు వాటి ప్రవేశ పరీక్షలను కూడా ప్రభుత్వం త్వరత్వరగా చేస్తుంది. కరోనా కారణంగా ఇప్పటికే ఒక సంవత్సరం లేటు కావడంతో ప్రభుత్వం ఇక జాప్యం చేయకుండా అన్నీ రకాల చర్యలను తీసుకుంటున్నారు.. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరగవలసిన పరీక్షలను పూర్తిగా నిర్వహిస్తున్నారు. కాగా, ఇప్పుడు ఎంసెట్ ఫలితాల కౌన్సిలింగ్ ను చేపడుతున్నారు. ఇటీవల ఇంజినీరింగ్ వాళ్లకు కౌన్సిలింగ్ పూర్తి చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఎంసెట్ ఫార్మసీ వాళ్లకు కౌన్సిలింగ్ ను నిర్వహించనున్నారు..

అందుకు సంబంధించిన షెడ్యుల్ ను విడుదల చేసారు.. వివరాల్లోకి వెళితే..ఎంసెట్‌ అగ్రికల్చర్‌ విభాగంలో ఉత్తీర్ణులైన విద్యార్థులు నాలుగేళ్ల బీఫార్మసీ, ఆరేళ్ల ఫార్మా-డితో పాటు బీటెక్‌ బయోటెక్నాలజీ కోర్సుల్లో చేరేందుకు న‌వంబ‌రు 19వ తేదీ నుంచి ఎంసెట్‌ బైపీసీ-2020 ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది..అయితే కాలేజీల్లో మూడు కోర్సుల్లో దాదాపు 8 వేల వరకు సీట్లు అందుబాటులో ఉంటాయి. బైపీసీ విద్యార్థులు బీటెక్‌ బయోటెక్నాలజీలో చేరేందుకు గణితం బ్రిడ్జి కోర్సు చేయాల్సిన అవసరం లేదని ఏఐసీటీఈ ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..

ప్రైవేట్ కాలేజీల్లో కౌన్సిలింగ్ ప్రక్రియను వచ్చే నెల 5 వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు తాజాగా వెల్లడించింది..ధ్రువపత్రాల పరిశీలన కోసం ఈ నెల 19 నుంచి 21 వరకు బుకింగ్‌ నమోదు చేసుకోవాలి. ఈ నెల 20, 21న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకు వెబ్‌ ఆప్షన్లకు గడు ఇచ్చారు. ఈ నెల 24న ఫార్మసీ సీట్ల కేటాయింపు జరగనుంది..విడత ధ్రువపత్రాల పరిశీలన కోసం డిసెంబరు 1న స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలి. డిసెంబర్‌ 2న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. డిసెంబరు 2, 3 తేదీల్లో రెండో విడత వెబ్‌ ఆప్షన్లకు గడువు ఇచ్చారు. డిసెంబరు 5న అభ్యర్థులకు సీట్ల కేటాయింపును జరపనున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: