తెలంగాణ సర్కార్ వాయిదా పడిన తరగతులను ఇప్పుడు వెంట వెంటనే నిర్వహిస్తున్నారు.. అంతేకాదు.. కరోనా వల్ల ఆగిపోయిన పరీక్షలను కూడా ప్రభుత్వం జరిపిస్తుంది.. ఇకపోతే ఇటీవల జరిపిన పరీక్షలన్నీ కూడా జరిపించి , పది రోజుల లోపే వాటికి సంబందించిన ఫలితాలను కూడా వెల్లడించింది.. స్కూల్స్ , కాలేజీలకు సంబందించిన వచ్చే ఏడాది అకడమిక్ క్యాలెండర్ ను కూడా విడుదల చేసింది..ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరగనున్న ఇంజనీరింగ్ పరీక్షలకు సంబందించిన షెడ్యుల్ ను యునివర్సిటీ విడుదల చేసిన సంగతి తెలిసిందే..అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల షెడ్యుల్ లో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు యునివర్సిటీ మేనేజ్మెంట్ తాజాగా ప్రకటించారు.ఇందుకు సంబంధించి సవరించిన టైమ్ టేబుల్‌ను ఉస్మానియా యూనివర్సీటీ విడుదల చేసింది. మొదట విడుదల చేసిన పరీక్షల టైమ్ టేబుల్ ప్రకారం.. రోజుకో ఎగ్జామ్ నిర్వహించేలా రూపొందించారు. అయితే తాజాగా రెండు ఎగ్జామ్స్ మధ్యలో కనీసం ఒక్క రోజు గ్యాప్ ఉండేలా టైమ్ టేబుల్‌ను మార్పు చేశారు.
ఇకపోతే తర్వాత జరగనున్న సెమిస్టర్ ఎగ్జామ్స్ కు మధ్యలో దాదాపు 45 రోజులు గ్యాప్ ఉండేలా అన్నీ చర్యలను తీసుకున్నారు..ఇలా చేయడం ద్వారా విద్యార్థులకు తగిన ప్రిపరేషన్ టైమ్ దొరుకుతుందని యూనివర్సిటీ ఇంచార్జ్ వైఎస్ చాన్సలర్ అరవింద్ కుమార్ తెలిపారు. ఇక.. ఈ నెల 23 నుంచి ఓయూ ఇంజనీరింగ్ సెమిస్టర్ అన్నీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్ సైట్ లో పొందుపరిచారు..https://www.ouexams.in/ ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా ఆ లింక్ లో చూడవచ్చు నని పేర్కొన్నారు..
సవరించిన షెడ్యుల్ వివరాలు ఇవే..
ఆరవ సెమిస్టర్(మెయిన్స్)- నవంబర్ 23 నుంచి డిసెంబర్ 14 వరకు
మొదటి సెమిస్టర్(సప్లిమెంటరీ)- డిసెంబర్ 14 నుంచి జనవరి 02 వరకు
రెండవ సెమిస్టర్(మెయిన్/బ్యాక్‌లాగ్)- నవంబర్ 24 నుంచి డిసెంబర్ 15 వరకు
మూడో సెమిస్టర్(సప్లిమెంటరీ)- నవంబర్ 23 నుంచి డిసెంబర్ 17వరకు
నాలుగో సెమిస్టర్(మెయిన్)- డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 28 వరకు జరుగుతాయని పేర్కొన్నారు..