ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలకు అన్నీ రకాలుగా మంచి చేయాలని భావిస్తున్నారు.. అందులో భాగంగా ప్రజల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు.. నిరుద్యోగ సమస్యలను కూడా పూర్తిగా రూపుమాపేందుకు మరో కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. విద్య, ఉపాధి రంగాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, నాడు-నేడు అంటూ పలు సంక్షేమ పథకాలను ప్రకటించారు. అలాగే.. ఉపాధి రంగాన్ని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఏపీఎస్‌ఎస్‌డీసీని ఏర్పాటు చేశారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు..
ఇప్పుడు రాష్ట్రంలోని యువత విదేశాల ఉద్యోగాలు పొందేందుకు వీలు కల్పిస్తున్నాడు..అంతర్జాతీయ వలస కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ బోర్డు సమావేశానికి ఆన్‌లైన్‌లో మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విదేశాలకు వెళ్లాలనే ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతకు ఐఎంసీ ద్వారా సమాచారమిస్తామని.. జిల్లా ఉద్యోగ కల్పన కేంద్రాలు, నైపుణ్య కేంద్రాలు, ఐటీఐల్లో వంటి కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు..ఈ శిక్షణ కేంద్రాల ద్వారా విదేశాలకు వెళ్ళాలనే వారికి అవసరమైన శిక్షణను ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.. జర్మనీ, గల్ఫ్, యూరప్ దేశాల్లో 3 వేల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి గౌతమ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.. ఇలా చేయడం వల్ల విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని ఆశ పడుతున్న వారి కల కొంతవరకు అయిన నెరవేరుతుందని అన్నారు.. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పూర్తిగా తగ్గిపోతుందని జగన్ ప్రయత్నాలు విద్యార్థులకు మేలు చేస్తాయని అన్నారు..