అయితే, తెలంగాణలో టెన్త్ పాసైన వారందరికీ కూడా ఇంటర్ లో అడ్మిషన్లు లభిస్తాయని తెలంగాణ విద్యా శాఖ వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ అడ్మిషన్ల గడువును కూడా ఇటీవల పెంచారు.. రాష్ట్రంలో ఇంటర్ అడ్మిషన్ల గడువు తేదీని ఇంటర్మీడియట్ బోర్డు మరోసారి పొడిగించింది. రాష్ట్రం లోని అన్నీ ప్రయివేటు, ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలకు ఇది వర్తించనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16తో గడువు ముగిసింది. అయితే పదోతరగతి పాసైన విద్యార్థులందరికీ ఇంటర్‌లో అడ్మిషన్లు కల్పించాలనే ఉద్దేశంతో గడువు తేదీని పొడిగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది..
రాష్ట్రంలో 1,300 ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉండగా.. ఇప్పటివరకు 700 కాలేజీలకు అఫిలియేషన్లు ఇచ్చారు. అఫిలియేషన్ నిబంధనల డాక్యుమెంట్లు సమర్పించని 500 కాలేజీల అఫిలియేషన్లు నిలిపివేసినట్టు బోర్డు అధికారులు వెల్లడించారు. ఇకపోతే విద్యా సంవత్సరాన్ని ఏప్రిల్ మరియు మే నెలాఖరు వరకు కొనసాగించినా పండగ, ఇతర సెలవులను మినహాయిస్తే 120 రోజుల పనిదినాలు రావాలంటే డిసెంబరులోనే 9, 10 తరగతులతో పాటు ఇంటర్ తరగతులు మొదలుపెట్టాల్సి వస్తుందని తెలంగాణ విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు..