కరోనా కారణంగా ఏపిలో స్కూళ్లు, కాలేజీలు మూతపడిన సంగతి తెలిసిందే.. దాదాపు ఆరు నెలలు వరకు ఎటువంటి చర్యలు లేవు. ఇటీవల లాక్ డౌన్ లో సడలింపు లు కారణంగా మళ్లీ స్కూల్స్ కాలేజీలు ప్రారంభం అయ్యాయి. నవంబర్ 2 నుంచి స్కూల్స్ ఓపెన్  అయిన సంగతి తెలిసిందే..నవంబర్ 23 నుంచి మిగిలిన తరగతులకు కూడా తరగతులు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే డిసెంబర్ 14 నుంచి 1-5 తరగతులు ప్రారంభిస్తాం. నవంబర్ 2 నుంచి ఆరు వారాల తర్వాత ప్రైమరీ స్కూళ్లు తెరుస్తాం. నవంబర్ 23 నుంచి రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లను తెరవనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే స్కూల్స్ శానిటైజ్ చేశారు. ఉపాధ్యాయులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.. విద్యార్థులకు ఇప్పుడు స్కూల్ లో ఏదైనా జరిగితే స్కూల్ యాజమాన్యం పూర్తి బాధ్యతను వహించాలని కోరారు.



ఇప్పటికే పలు పరీక్షలను కూడా ఏపి సర్కార్ నిర్వహించి, వాటి ఫలితాలను కూడా విడుదల చేశారు.  బీటెక్ తదితర వాటికి సంబందించిన ప్రవేశ పరీక్షలను కూడా పూర్తి చేసింది. ఇటీవల ఏంసెట్, డాక్టర్ ప్రవేశ కోర్సులకు సంబంధించిన కౌన్సిలింగ్ ను కూడా పూర్తి చేశారు. ఇప్పుడు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు గాను విద్యార్థులకు మరో అవకాశం కల్పించారు ఏపి సర్కార్.. ఇంతవరకు ప్రవేశాలు పొందనివారికోసం 'దోస్త్‌' స్పెషల్‌ డ్రైవ్‌ తేదీలను ప్రకటించారు. ఈ ప్రక్రియలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను శుక్రవారం నుంచి డిసెంబరు-2వరకు చేసుకోవచ్చునని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు..



అందులో ఎంపికైనవా జాబితాను డిసెంబరు-4న ప్రకటిస్తారు. ఇంతవరకు సీటుకు దరఖాస్తు చేయనివారితోపాటు దరఖాస్తు చేసినా సీటు దక్కనివారు, రిజిస్ట్రేషన్‌ చేసుకున్నా వెబ్‌ ఆప్షన్‌ ఇవ్వనివారు, సీటు ఖరారైనా కాలేజీలో చేరనివారు తాజాగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు ఈ వార్త విద్యార్థులకు ఊరటను కలిగిస్తుంది... ఏపి సర్కార్ నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: