
ఈ విషయం పై మంత్రి మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు లేని నేపథ్యంలో టెన్త్ సిలబస్ ఆధారంగానే ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించినట్లు తెలిపారు.. అందువల్లే చాలా మంది విద్యార్థులు మెరిట్ ను సాధించారు అని ఆయన తెలిపారు. ఇక విషయానికొస్తే .. ఈ పరీక్షకు 85,755 మంది విద్యార్ధులు హాజరయ్యారని పేర్కొన్నారు. జనవరి 4 నుంచి కౌన్సెలింగ్, 18 నుంచి తరగతులు మొదలవుతాయని మంత్రి వెల్లడించారు.
ఇంటర్ అడ్మిషన్ కోసం ఆన్‌లైన్ ప్రాసెస్ ఏర్పాటు చేశామన్నారు. విద్య వ్యాపారం కాకూడదనే ఆన్ లైన్ విధానం తెచ్చామని తెలిపిన మంత్రి.. మౌలిక వసతులు లేని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవడం తో పాటుగా కాలేజీ కథను కంచికి చేరుస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రభుత్వ నియమాలకు కట్టుబడి కాలేజీ ల తీరు లేకుంటే కాలేజీ లైసెన్స్ కూడా రద్దు అవుతుందని ఆయన పేర్కొన్నారు. కరోనా భయం ఒకవైపు కొనసాగుతున్న కూడా విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరు కావడంతో పాటుగా మంచి రిజల్ట్స్ ను కూడా అందుకోవడం సంతోషాన్ని కలిగించే వార్త.. వచ్చే ఏడాదికి సంబంధించిన అన్నీ తరగతుల అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసాము. వాటి ప్రకారం సిలబస్ ను అధ్యాపకులు కవర్ చేస్తారని వెల్లడించారు.