తెలంగాణ సర్కార్ రాష్ట్ర అభివృద్ది కోసం అహర్నిశలు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రణాళికలను సిద్దం చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తీర్చే దిశగా అడుగులు వేస్తుంది. తాజాగా ప్రభుత్వం ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం ఆయా శాఖలలో ఉద్యోగాల ను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.



పోలీసు శాఖలో పోస్టుల నియామకానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ పోస్టుల భర్తీకి జ‌న‌వ‌రిలోనే ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈసారి నియామక ప్రక్రియని మరింత సరళం చేసేందుకు.. ప్రత్యేక యాప్‌ రూపొందించాలని పోలీసు నియామక మండలి అధికారులు భావిస్తున్నారు. ఈ యాప్ ద్వారా గతంలో దరఖాస్తు లలో ఎదురైన సమస్యలు ఇప్పుడు ఏర్పడవని తెలుస్తుంది.



పోలీసు శాఖలో ప్రస్తుతం 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. వీటిలో రాష్ట్ర వ్యాప్తంగా 425 ఎస్సై పోస్టులు అవసరమని పేర్కొన్నారు. దీనిలో ఎస్సై సివిల్‌-368, ఏఆర్‌-29, కమ్యూనికేషన్స్‌-18 పోస్టులు ఉన్నాయి. 19,300 కాని స్టేబుల్‌ పోస్టులను భర్తీచేయాలని నివేదిక లో తెలిపారు. వీటిలో సివిల్‌-7764, ఏఆర్‌-6683, టీఎస్‌ఎస్‌పీ-3874, కమ్యూనికేషన్స్‌-256, 15వ బెటాలియన్ ‌లో 561 ఖాళీలు ఉన్నాయి.. ఈ పోస్టులకు భర్తీని చేపడుతుంది..



రాత పరీక్షల తో పాటు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలి. అన్నింటిలోనూ ఉత్తీర్ణులై ఎంపికైన వారికి సంవత్సరంపాటు శిక్షణ ఉంటుంది. ఈ నేపథ్యం లో వీలైనంత త్వరలోనే నియామక ప్రకటన జారీచేయాలని అధికారులు వెల్లడించారు. నార్త్‌జోన్‌ పరిధి లోని కార్ఖానా పోలీసుస్టేషన్‌ నూతన భవనాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. రాష్ట్రం లో గడిచిన ఆరేళ్లలో 27 వేల మంది పోలీసు పోస్టులు భర్తీ చేసినట్లు వెల్లడించారు. మహిళల భద్రత కోసం మరింత ఎక్కువగా పోలీసులను తీసుకోనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: