కరోనా కారణంగా ప్రపంచమంతా ఒక్కసారిగా స్తంభించింది.. విద్యార్థులకు కూడా ఈ ఏడాది అంతగా తరగతులు జరగలేదు.. దీంతో ఇప్పుడు కరోనా తగ్గడం తో పాఠశాలలను మళ్లీ పునః ప్రారంభించారు. కరోనా ప్రభావం వల్ల విద్యార్థులను పాఠశాలలకు పంపించడానికి తల్లి దండ్రులు భయపడటం తో ప్రభుత్వం పిల్లలకు ఇంట్లోనే కూర్చొని క్లాసులు వినే విధంగా ఆన్ లైన్ క్లాసులను నిర్వహించారు. చాలా మంది వీటి ద్వారా క్లాసుల ను కొంత వరకు పూర్తి చేశారు.



ప్రస్తుతం పై తరగతులకు స్కూల్స్, కాలేజీలు ప్రారంభించారు.. అయిన కొన్ని తరగతులు జరగలేదు.. దీంతో మళ్లీ ఆన్ లైన్ క్లాసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  ఈ నేపథ్యం లో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విద్యార్థులకు ఎటువంటి అవాంతరాలు కలుగకూడదనే ఉద్దేశంతో పంజాబ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేసింది. 12వ తరగతి చదువుతున్న దాదాపు 1.30 లక్షల మంది ప్రభుత్వ విద్యార్థులకు వీటిని అందించింది. ఈ కార్యక్రమం కింద మొత్తం 1,75,443 మంది 12వ తరగతి విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు అందించాల్సి ఉండగా, తొలి విడతగా 1,30,000 మందికి పంపిణీ చేశారు..



ఈ విషయాన్ని పంజాబ్ ముఖ్య మంత్రి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.. మిగిలిన విద్యార్థులకు త్వరలోనే మొబైల్స్ ను పంపిణీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు..12వ తరగతి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో స్మార్ట్‌ఫోన్ల పంపిణీని ప్రారంభించినట్టు పంజాబ్ సీఎం వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం లో భాగంగా అందిస్తున్న ఫోన్లు పూర్తి నాణ్యంగా ఉంటాయన్నారు. విద్యార్థులకు ఇక పై స్మార్ట్‌ఫోన్ మంచి ప్రయోజనకారి అవుతుందన్నారు.. విద్యార్థుల కోసం ఈ స్మార్ట్ ఫోన్లను 92 కోట్లు వ్యయంతో కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు మంచి చేకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. ఇలాంటి ఆలోచనలు ప్రతి ఒక్క ప్రభుత్వం చేస్తే బాగుంటుందని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: