కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు ను అందించింది. కరోనా వల్ల చాలా మంది నిరాశ్రయులు అయ్యారు. ఉద్యోగస్తులు అయితే ఉన్న ఉద్యోగాలు పోగొట్టుకొని రోడ్డున పడ్డారు. చివరికి తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం కొత్త ఆలోచనలు చేస్తున్నారు. కొత్త ఉద్యోగాల కోసం ప్రముఖ కంపెనీలతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  ఇప్పుడు మరో శుభవార్తను అందించింది. 727 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. బ్రాడ్ కాస్ట్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ లో వేర్వేరు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది.



ఆల్ ఇండియా ఇన్‌సిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్స్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు మొదలైనట్లు తెలిపారు. ఇకపోతే డిసెంబర్ 26 న ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల చివరి తేదీ గా వెల్లడించారు..ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను https://www.becil.com/ వెబ్ సైట్ లో పొందుపరిచారు.మెకానిక్, లైన్ మెన్, స్టోర్ కీపర్, వైర్ మెన్, ప్లంబర్, ఆపరేటర్, అసిస్టెంట్ ల్యాండ్రీ సూపర్ వైజర్, స్టెనోగ్రాఫర్, టెక్నీషియన్, శానిటరీ ఇన్ స్పెక్టర్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.



ఒక్కో ఉద్యోగానికి ఒక్కో విద్యార్హత ఉంటుంది. అలాగే జీతం కూడా ఉద్యోగాన్ని బట్టి పెరుగుతూ వస్తుంది అని తెలిపారు.20,000 రూపాయల నుంచి 45,000 రూపాయల వేతనం లభిస్తుంది.10వ తరగతి, ఇంటర్ పాసైన వాళ్లకు కూడా ఉద్యోగాలు ఉన్నాయి. కొన్ని ఉద్యోగాలకు మాత్రం ఐటీఐ, డిప్లొమా చదివిన వాళ్లు మాత్ర్మే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాల దరఖాస్తు కోసం 830 రూపాయల ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు మాత్రం 600 రూపాయలు ఫీజు చెల్లించి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా అర్హత, వేతనం దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన మొదలగు వివరాలను సులువుగా తెలుసుకోవచ్చు.. ఈ ఉద్యోగాల ద్వారా నిరుద్యోగుల సమస్యలు పూర్తిగా తగ్గిపోతుందని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: