ప్రస్తుతం కొత్త ఉద్యోగాల మాట అటుంచితే కరోనా ప్రభావం వల్ల ఉన్న ఉద్యోగాలు కూడా పోగొట్టుకొని చాలా మంది రోడ్డున పడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త ఉద్యోగాలను కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రభుత్వ విభాగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఐటీ రంగ సంస్థలు మరింతగా ఫ్రెషర్స్‌ను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి.



ఈ ఏడాదికి గాను ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఫ్రెషర్స్‌కు ఎక్కువ అవకాశాలు ఇచ్చేలా కనిపిస్తున్నాయి. టీసీఎస్‌, విప్రో మాత్రం నిరుడు మాదిరిగానే ఈసారీ నియామకాలు చేపట్టాలని చూస్తున్నట్లు తెలుస్తున్నది. మొత్తంగా ఈ 4 సంస్థలు కలిసి క్యాంపస్‌ల నుంచి 91వేల మంది కొత్తవారిని తీసుకోనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశీయ ఐటీ రంగ దిగ్గజం టీసీఎస్‌ 40వేల మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలిచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఇంతే స్థాయిలో నియామకాలుంటాయని సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, గ్లోబల్‌ హెచ్‌ఆర్‌ హెడ్‌ మిలింద్‌ లక్కడ్‌ ఇటీవలి మీడియా సమావేశాల్లో తెలిపారు.



అయితే దేశంలో రెండో అతిపెద్ద ఐటీ రంగ సంస్థ ఇన్ఫోసిస్‌ మాత్రం 2021-22లో 24వేల మంది ఫ్రెషర్స్‌ను ఉద్యోగాల్లోకి తీసుకుంటామని చెప్తున్నారు.12 వేల మందికి పైగా ప్రేషర్స్ కు ఉద్యోగాలు కల్పించనున్నారు. ఆర్థిక సంవత్సరంలో ఇక ఐటీ సంస్థల క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు ముగిసినట్లేనని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. కరోనా వైరస్‌ దెబ్బకు ఐటీ రంగం కూడా ప్రభావితమైంది. 81 వేల మందికి ఐటీ ఉద్యోగాలు ఫ్రెషర్స్‌ను ఆయా సంస్థలు ఉద్యోగాల్లోకి తీసుకోగా ఈ యేడు అంతకన్నా  తక్కువ తీసుకోనున్నట్లు వెల్లడించారు.జర్మనీ ఆటో రంగ దిగ్గజం దైమ్లర్‌ నుంచి మునుపెన్నడూ లేనివిధంగా ఇన్ఫోసిస్‌కు భారీ డీల్‌ వచ్చింది. దీని విలువ దాదాపు రూ.25వేల కోట్లు. అలాగే టీసీఎస్‌కు ప్రుడెన్షియల్‌ ఫైనాన్షియల్‌తో అతిపెద్ద డీల్‌ కుదిరింది. విప్రో సైతం జర్మనీ రిటైలర్‌ మెట్రో నుంచి పెద్ద ఒప్పందాన్నే అందుకుంది.వీటి వల్ల చాలా మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: