ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు బాగా ఒత్తిడికి గురవుతున్నారు. కరోనా కారణంగా చాలా నెలలు స్కూల్స్ ,కాలేజీలు లేకపోవడం తో ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు కరోనా ప్రభావం పూర్తిగా తగ్గి పోయింది. ఈ నేపథ్యంలో స్కూల్స్ , కాలేజీలను తిరిగి ప్రారంభించారు. అయితే, కరోనా వ్యాక్సిన్ వచ్చినా కూడా జనాల్లో భయం పోలేదు. దీంతో ఆన్ లైన్ క్లాసులను ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఇకపోతే కాలేజీ విద్యార్థులకు మాత్రం క్లాసులకు ఫిబ్రవరి నుంచి యదావిధిగా కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తుంది. 34 రోజులు మాత్రమే తరగతులు నిర్వహించి అనంతరం పరీక్షలు నిర్వహిస్తున్నారు. గతం తో పోలిస్తే ఇప్పుడు పరీక్షలను సగం కు తగ్గించారు.



కాగా , ఇంటర్ విద్యార్థులకు మే 3 నుంచి పరీక్షలను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్‌మీడియట్‌ వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాల్లో ఈసారి ఛాయిస్‌ 50 శాతానికి పెరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ఆమోదం కోసం ఇంటర్‌బోర్డు ప్రతిపాదనలు పంపనుంది. కరోనా పరిస్థితుల్లో విద్యార్థులకు కొంత వెసులుబాటు ఇవ్వాలని భావిస్తున్న బోర్డు అధికారులు ఛాయిస్‌ పెంపుపై ఇటీవల పలు చర్చలు చేశారు.ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ప్రశ్నపత్రాల్లో, ముఖ్యంగా ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ప్రతి దాంట్లో మూడు సెక్షన్లు ఉండగా..అందులో రెండింటికీ 50% ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. 



ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు మానసిక ఒత్తిడిని తట్టుకొనేందుకు స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌పై ఆన్‌లైన్‌లో అయిదారు తరగతులు నిర్వహించాలని బోర్డు భావిస్తోంది. కెరీర్‌ గైడెన్స్‌పైనా అవగాహన కల్పించనుంది.ఓ విద్యార్థి ఏ రంగంలో రాణించేందుకు అవకాశం ఉందో గుర్తించి సలహా ఇచ్చేందుకు సైకోమెట్రిక్‌ పరీక్ష జరపాలని అధికారులు భావిస్తున్నారు. ఎంపిక చేసిన 10 కళాశాలల్లో ఆన్‌లైన్‌లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలను బట్టి విద్యార్థుల భవిష్యత్ ను నిర్ధారించవచ్చునని చెప్తున్నారు. గత విద్యా సంవత్సరం మోడల్‌ స్కూళ్లలో పదో తరగతి విద్యార్థులకు సైకోమెట్రిక్‌ పరీక్షలు జరిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: