
పేపర్ తో గ్లాస్ వస్తువులు, గ్లాస్ డోర్స్ గ్లాస్ విండోస్, క్లాస్ మిర్రర్,టీవీ గ్లాస్ లను క్లీన్ చేయడానికి ఉపయోగించవచ్చు. పేపర్ ను నీళ్లలో తడిపి అద్దం పై తుడిచిన తర్వాత కోడి పేపర్ తో తుడవడం వల్ల అద్దాలు మిలమిలా మెరుస్తాయి.
ఇంట్లో కానీ, ఆఫీస్ లో గాని రాక్స్ సెల్ఫ్ లో ఏమైనా వస్తువులు పెట్టేముందు వాటి కింద పేపర్ ని పెట్టడం వల్ల రాక్స్ డ్యామేజ్ కాకుండా,గీతలు పడకుండా ఉంటాయి. అంతేకాకుండా చూడటానికి నీట్ గా ఉంటాయి.కాబట్టి బుక్ రాక్స్,షూ రాక్స్,క్యాబినెట్ రాక్స్,కిచెన్ రాక్స్ ల్లో వస్తువులను పెట్టడానికి ముందు న్యూస్ పేపర్ పరచడం వల్ల నీట్ గా ఉంటాయి.
ఆఫీసుకు త్వరగా వెళ్లాలనుకున్నప్పుడు షూ ను ప్రేమతో తుడిస్తే అది ఎంత సేపు ఆరిపోదు అలాంటి సమయంలో న్యూస్ పేపర్ తో తుడవడం వల్ల తేమ తొందరగా అవుతుంది.అంతేకాకుండా వుడెన్ టేబుల్ మీద టీ మరకలు గాని, కాఫీ మరకలు గానీ పడినప్పుడు న్యూస్ పేపర్ తో తుడవడం వల్ల తేమ త్వరగా పీల్చుకుంటాయి.
వెస్ట్ పేపర్ అని పడేయకుండా వాటితో ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చు.ఫ్లవర్ తయారు చేసుకుని వాటికి రంగులు వేయడం వల్ల అందంగా కనబడతాయి. అంతేకాకుండా ల్యాంప్ లను తయారుచేసి ఇంటిలో అక్కడక్కడ యాడ్ చేయడం వల్ల అందంగా కనబడతాయి.
వేస్ట్ పేపర్ ను బొమ్మలు తయారు చేయడానికి ఉపయోగించవచ్చు.పేపర్ తో చేసిన బొమ్మలు అంటే పిల్లలు చాలా ఇష్టపడతారు. ఎలా చేయాలంటే ఏరోప్లేన్, బోట్,అనిమల్స్, బర్డ్ వంటి వాటిని తయారు చేసి పిల్లలకు ఇవ్వడం వల్ల సంతోషంగా ఉంటారు.
కూరగాయలు ఫ్రెష్ గా ఉండడానికి న్యూస్ పేపర్ లో పెట్టి ఫ్రిజ్ లో పెట్టడం వల్ల తాజాగా ఉంటాయి. ఫ్రిడ్జ్ లోనే కాకుండా బయట పెట్టినా కూడా పేపర్ లో పెట్టడం వల్ల కూరగాయలు ప్రెస్ గా ఉంటాయి.
ఇనుప వస్తువులు ఎక్కువగా తుప్పు పడుతుంటాయి. తొలగించడానికి న్యూస్ పేపర్ బాగా ఉపయోగపడుతుంది.న్యూస్ పేపర్ తో తుప్పు మరకలను తుడిచి ఆ తర్వాత నీటితో కడగడం వల్ల శుభ్రంగా ఉంటాయి.