ప్రస్తుత పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా నిరుద్యోగుల సమస్య నానాటికీ పెరుగుతోంది.. ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి అవసర మైన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు నోటిఫికేషన్ ను విడుదల చేసారు. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగాల నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. నాన్ సీఎస్‌జీ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 53 ఖాళీలున్నాయి. అసిస్టెంట్ మేనేజర్, లీగల్ ఆఫీసర్, మేనేజర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయాల్సి ఉంది. దరఖాస్తు ప్రక్రియ 2021 ఫిబ్రవరి 23 న ప్రారంభం కానుంది.


అయితే , ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 2021 మార్చి 10 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://opportunities.rbi.org.in/ లేదా https://www.rbi.org.in/ వెబ్ ‌సైట్‌ లో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 23న విడుదల కానుంది.


మొత్తం ఖాళీలు- 53
అసిస్టెంట్ మేనేజర్ (అఫీషియల్ లాంగ్వేజ్)- 12
లీగల్ ఆఫీసర్ (గ్రేడ్ బీ)- 11
మేనేజర్ (టెక్నికల్ సివిల్)- 1
అసిస్టెంట్ మేనేజర్ ( ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ)- 5

అసిస్టెంట్ మేనేజర్ (అఫీషియల్ లాంగ్వేజ్ )- హిందీ సబ్జెక్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ. రెండేళ్ల అనుభవం.
లీగల్ ఆఫీసర్ (గ్రేడ్ బీ)- న్యాయ శాస్త్రంలో గ్రాడ్యుయేషన్. రెండేళ్ల అనుభవం.
మేనేజర్ (టెక్నికల్ సివిల్)- సివిల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్. మూడేళ్ల అనుభవం.
అసిస్టెంట్ మేనేజర్ (ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ)- ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌లో ఆఫీసర్ ర్యాంక్‌లో 5 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉండాలి..


దరఖాస్తు ప్రారంభం- 2021 ఫిబ్రవరి 23
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 10
రాతపరీక్ష- 2021 ఏప్రిల్ 10
విద్యార్హతలు- పోస్ట్ గ్రాడ్యుయేషన్
వేతనం- రూ.77,208 వరకు
ఎంపిక విధానం- రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది.  


బ్యాంక్ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన విద్యార్థులు మరియు నిరుద్యోగులు పైన తెలిపిన వెబ్ సైట్ లో పూర్తి వివరాలను తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: