ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మరొక శుభవార్త లాంటిది. DRDO ( డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ) నుంచి  మరొక నోటిఫికేషన్ వెలువడింది. ప్రూఫ్ అండ్ ఎక్స్ పెరిమెంటల్ ఎస్టాబ్లిష్మెంట్-PXE కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. డిప్లమా, ఐటీఐ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తోంది. మొత్తం 69 ఖాళీలు ఉన్నాయి. ఒడిశాలోని బాలాసోర్ లో గల డీ ఆర్ డీ ఓ  ప్రూఫ్ అండ్ ఎక్స్ పెరిమెంటల్ ఎస్టాబ్లిష్మెంట్ యూనిట్లో ఈ ఖాళీలు ఉన్నాయి.


ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాల కోసం http://www.drdo.gov.in/ ఈ  వెబ్ సైట్ లో చూడండి.  దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 27 న చివరి తేదీ. నోటిఫికేషన్ పూర్తిగా చదివి, విద్యార్హతలు తెలుసుకొని టెక్నీషియన్ డిప్లమా  అప్రెంటిస్ అభ్యర్థులు  తప్పనిసరిగా నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ -NATS, ఐటీఐ అభ్యర్థులకు నేషనల్ అప్రెంటిస్ ప్రమోషన్ స్కీమ్ -NAPS పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేయాలి.


మొత్తం ఖాళీలు : 62
మొత్తం ఖాళీల వివరాలు:
టెక్నీషియన్ డిప్లమా అప్రెంటిస్ -39
డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ - 2
డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ - 2
డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ - 14
డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ - 4
డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 1
డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 7
డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‍స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ - 1
డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ - 7
డిప్లొమా ఇన్ సర్వే ఇంజనీరింగ్ - 1

ఐటీఐ అప్రెంటిస్ -23

ఐటీఐ ఇన్ ఫిట్టర్ - 7
ఐటీఐ ఇన్ డీజిల్ మెకానిక్ - 1
ఐటీఐ ఇన్ ఎలక్ట్రీషియన్ - 3
ఐటీఐ ఇన్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) - 4
ఐటీఐ ఇన్ ఎలక్ట్రానిక్స్ - 2
ఐటీఐ ఇన్ వెల్డర్ - 2
ఐటీఐ ఇన్ టర్నర్ - 2
ఐటీఐ ఇన్ మెషినిస్ట్ - 2

 విద్యార్హతలు:
సంబంధించిన విభాగంలో డిప్లమా ఐటిఐ పాస్ అయి ఉండాలి.

 వేతనం :
డిప్లమా అప్రెంటిస్ పోస్టులకు ఎనిమిది వేల రూపాయలను, ఐటీఐ అప్రెంటిస్ పోస్టులకు ఏడు వేల రూపాయలను ఇవ్వనుంది.

 దరఖాస్తు విధానం:
 డీ ఆర్ డీ ఓ అధికారిక వెబ్సైట్ దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసి, పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి, director@pxe.drdo.in మెయిల్ ఐడీకి 2021 ఫిబ్రవరి 27 లోగా పంపాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: