మన దేశంలో నిరుద్యోగ సమస్య చాలా ఉంది. అందుకోసం ప్రభుత్వం ప్రతి రోజూ ఏదో ఒక నోటిఫికేషన్ ను విడుదల చేస్తూనే ఉంది. టెన్త్,ఇంటర్ పాస్ అయిన వారికి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ - BRO,లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 459 ఖాళీలను ప్రకటించింది. జనరల్ రిజర్వ్ ఇంజనీరింగ్ కోర్సులో మొత్తం 7 ట్రైడ్ ఖాళీలు ఉన్నాయి. కేవలం పురుషులకు మాత్రమే ఈ పోస్టులకు అర్హత కలిగి ఉంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ అప్లై చేయడానికి 2021 ఏప్రిల్ 4 చివరి తేదీ. మరికొన్ని వివరాల కోసం బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధికారక వెబ్ సైట్ http://bro.giv.in/ లో చూడొచ్చు.
మీరు ఈ దరఖాస్తు కి అప్లై చేసుకునే ముందు పూర్తిగా నోటిఫికేషన్ ను చదివి, విద్యార్హతలు తెలుసుకొని అప్లై చేసుకోవాలి. ఈ వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసి, దరఖాస్తు ఫారమ్ ను పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్లను జతచేయవల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో వెల్లడించిన అడ్రస్ కు దరఖాస్తు ఫారమ్ ను పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్లను జతచేసి పంపాల్సి ఉంటుంది.
BRO RECUMENT 2021: ఖాళీల వివరాలు...
మొత్తం ఖాళీలు సంఖ్య : 459
(అన్‌రిజర్వ్‌డ్- 195, ఎస్సీ- 66, ఎస్టీ- 32, ఓబీసీ- 121, ఈడబ్ల్యూఎస్-45)
డ్రాఫ్ట్స్‌మ్యాన్ : 43
సూపర్‌వైజర్ స్టోర్ : 11
రేడియో మెకానిక్ : 4
ల్యాబ్ అసిస్టెంట్ : 1
మల్టీ స్కిల్డ్ వర్కర్ (మేసన్) : 100
మల్టీ స్కిల్డ్ వర్కర్ (డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్) : 150
స్టోర్ కీపర్ టెక్నికల్ : 150
వేతనాలు :
డ్రాఫ్ట్స్‌మ్యాన్- ఏడో పే కమిషన్ పే లెవెల్ 5 : రూ.29,200- రూ.92,300 వరకూ
సూపర్‌వైజర్ స్టోర్- ఏడో పే కమిషన్ పే లెవెల్ 4 రూ.25,500- రూ.81,100 వరకూ
రేడియో మెకానిక్- ఏడో పే కమిషన్ పే లెవెల్ 4 రూ.25,500 - రూ.81,100 వరకూ
ల్యాబ్ అసిస్టెంట్- ఏడో పే కమిషన్ పే లెవెల్ 3 రూ.21,700 - రూ.69,100 వరకూ
మల్టీ స్కిల్డ్ వర్కర్ (మేసన్)- ఏడో పే కమిషన్ పే లెవెల్ 1 రూ.18, 000 - రూ.56900 వరకూ
మల్టీ స్కిల్డ్ వర్కర్ (డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్)- ఏడో పే కమిషన్ పే లెవెల్ 1 రూ.18,000 - రూ.56, 900 వరకూ
స్టోర్ కీపర్ టెక్నికల్- ఏడో పే కమిషన్ పే లెవెల్ 2 రూ.19, 900 - రూ.63, 200 వరకూ BRO ప్రకటించింది.