
టెన్త్ పాస్ అయిన వారికి ఒక శుభవార్త. ప్రతి ఒక్కరికి ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలని ఉంటుంది. అందుకోసం మన ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అలాంటివారికి టెన్త్ క్వాలిఫికేషన్ లో rbi లో ఆఫీస్ అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీలను 841 ఆఫీస్ అటెండర్ పోస్టులను భర్తీ చేయనుంది . ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అప్లై చేయడానికి 2021 మార్చి 15 చివరి తేదీ. ఈ పోస్టులకు సంబంధించిన వివరాలకోసం https://rbi.org.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
RBI office ATTENDANT RECRUIMENT 2021: ఖాళీల వివరాలివే.....
హైదరాబాద్-57
బెంగళూర్ -28
అహ్మదాబాద్ -50
భోపాల్ -25
చండీగఢ్ -31
చెన్నై -71
భువనేశ్వర్-24
గౌహతి-38
జైపూర్ -43
జమ్ము -9
కాన్పూర్ -69
కొలకత్తా -35
న్యూఢిల్లీ -50
ముంబై -202
నాగపూర్ -55
తిరువనంతపురం-26
పాట్నా -28
RBI RECRUITMENT గుర్తుంచుకోవాల్సిన తేదీలు
నోటిఫికేషన్ విడుదల-2021 ఫిబ్రవరి 24
దరఖాస్తు ప్రారంభం -2021 ఫిబ్రవరి 24
దరఖాస్తు చివరితేదీ -2021 మార్చి 15
టెస్ట్ ఫీజు చెల్లింపు-2021 ఫిబ్రవరి 24 నుంచి 2021 మార్చి 15
ఆన్లైన్ టెస్ట్ -2021 ఏప్రిల్ 9, 10
విద్యార్హతలు:
పదో తరగతి లేదా మెట్రిక్యులేషన్ పాస్ కావాలి. రిక్రూటింగ్ ఆఫీస్ పరిధిలో రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంల్లో పాసై ఉండాలి.
ఇతర అర్హతలు:
అండర్ గ్రాడ్యుయేట్ మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. గ్రాడ్యుయేట్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేయకూడదు.
వయసు :
18 నుంచి 25 ఏళ్ల లోపు. 1996 ఫిబ్రవరి 2 నుంచి 2003 ఫిబ్రవరి 1 లోపు జన్మించిన వారై ఉండాలి. ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు సడలింపు. మరియు ఓబిసి వారికి మూడేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
దేశవ్యాప్తంగా ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత లాంగ్వేజ్ ప్రోఫిషియేన్సీ టెస్ట్. ఈ టెస్ట్ స్థానిక భాషలో మాత్రమే ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
రూ. 450. ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరి అభ్యర్థులకు రూ.50 ఇక వేతన విషయానికి వస్తే రూ.26,508.