గత ఏడాది కరోనా కారణంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు.. అయితే ఇప్పుడు మళ్లీ కరోనా ప్రభావం మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో విద్యార్థులకు అసలు కలిసి రాలేదు.. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఏడాది వృదా అయ్యింది. దాంతో ఇటీవల కాలం లో పాఠశాలలను ప్రభుత్వం ఓపెన్ చేసింది. అయితే, కరోనా నిబంధనలు పాటిస్తూ స్కూల్స్ కొనసాగిస్తున్నారు. ఇక ఈ ఏడాది జరగవలసిన పరీక్షలను కూడా వెంటనే జరిగేలా చర్యలను తీసుకున్నారు. ఈ ఏడాది అకడమిక్ క్యాలెండర్ ను కూడా విడుదల చేసింది.


ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలను వాయిదా వేసేలా ఉన్నారు. వివరాల్లో కి వెళితే.. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వార్షిక పరీక్షల గురించి ఆందోళన చెందుతున్న వారికి పెద్ద ఊరట కల్పించింది. కరోనా నేపథ్యంలో ఈసారి కూడా పరీక్షలను రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 8, 10, 11వ తరగతుల విద్యార్థులు పరీక్షలు లేకుండా పాస్ చేస్తామని తమిళనాడు సీఎం పళని స్వామి అసెంబ్లీ వేదికి గా ప్రకటించారు. వారందరి నేరు గా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు..


మరో వైపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పళని స్వామి తీపి కబురు చెప్పారు. రిటైర్మెంట్ వయసును 59 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతున్నట్లు అసెంబ్లీ ప్రకటన చేశారు. ముఖ్య మంత్రి తీసుకున్న నిర్ణయం పై ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు, అటు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.త్వరలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమం లోనే అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రజలపై వరాల జల్లు కురిపిస్తోంది. అందులో భాగంగానే పరీక్షలను రద్దు చేయడం తో పాటు ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచింది... అయితే ఇప్పుడు ఏపి లో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుండునని భావిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: