
మొత్తం 71 ఖాళీలున్నాయి. ఐటీఐ, డిప్లొమా హోల్డర్స్ ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఇవి ఏడాది పోస్టులు మాత్రమే. 2018, 2019, 2020 సంవత్సరాల్లో ఐటీఐ, డిప్లొమా పూర్తి పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 మార్చి 12 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.drdo.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అనుకున్న జాబ్ పై అప్లై చేసుకోవాలి. మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్ విభాగంలో 500 లకు పైగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
డీఆర్డీఓ 2021 లో ఖాళీగా ఉన్న విభాగాల వివరాలు..
అప్రెంటీస్ ఖాళీలు మొత్తం- 71
డిప్లొమా అప్రెంటీస్ ట్రైనీ- 24
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 7
మెకానికల్ ఇంజనీరింగ్- 4
కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్- 13
ఐటీఐ అప్రెంటీస్ ట్రైనీ- 47
ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 24
మెషినిస్ట్- 7
టర్నర్- 6
ఫిట్టర్- 10
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 12 సాయంత్రం 5 గంటలు
విద్యార్హతలు- డిప్లొమా అప్రెంటీస్ ట్రైనీ పోస్టుకు సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఐటీఐ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేయాలి.
వయస్సు- 18 నుంచి 27 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం- డిప్లొమా అప్రెంటీస్ అభ్యర్థులు నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ పోర్టల్ http://portal.mhrdnats.gov.in/ లో అప్లై చేయాలి. ఐటీఐ అప్రెంటీస్ అభ్యర్థులు https://apprenticeshipindia.org/ పోర్టల్‌లో అప్లై చేయాలి.
డిప్లొమా అప్రెంటీస్ ట్రైనీకి రూ.8000 వేతనం
ఐటీఐ అప్రెంటీస్ ట్రైనీకి రూ.7000 వేతనం