నిరుద్యోగుల కు అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రభుత్వ శాఖలో పని చేసే అవకాశాలు లభిస్తున్నాయి..ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1809 ఖాళీల ను వెల్లడించింది... జూనియర్ స్టెనో గ్రాఫర్, ల్యాబ్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ కెమిస్ట్, జూనియర్ ఇంజనీర్, పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ డైరెక్టర్, సైంటిఫిక్ అసిస్టెంట్ లాంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ లో ఢిల్లీ జల్ బోర్డ్, ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2021 మార్చి 15న ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2021 ఏప్రిల్ 14 చివరి తేదీ. ఈ జాబ్ లకు సంబంధించిన పూర్తి వివరాలను https://dsssb.delhi.gov.in/ లేదా https://dsssbonline.nic.in/  వెబ్‌సైట్లలో  తెలుసుకోవచ్చు..


ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు ఇవే..

మొత్తం ఖాళీలు- 1809
టెక్నికల్ అసిస్టెంట్- 32
ల్యాబరేటరీ అటెండెంట్- 66
అసిస్టెంట్ కెమిస్ట్- 40
అసిస్టెంట్ ఇంజనీర్ ఈ అండ్ ఎం- 14
జూనియర్ ఇంజనీర్ - 62
డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్ 1- 16
పర్సనల్ అసిస్టెంట్- 84
ఫార్మసిస్ట్- 82
అసిస్టెంట్ డైరెక్టర్- 3
అసిస్టెంట్ గ్రేడ్ 2- 28
జూనియర్ స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్)- 13
జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్- 31
సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ- 6
సెక్యూరిటీ సూపర్‌వైజర్- 9
అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్- 158
కార్పెంటర్ 2 క్లాస్- 4
అసిస్టెంట్ ఫిల్టర్ సూపర్‌వైజర్- 11
ప్రోగ్రామర్- 5
టీజీటీ - 19
స్పెషల్ ఎడ్యుకేటర్ ప్రైమరీ- 1126


ఈ ఉద్యోగాలకు సంబంధించిన మొత్తం వివరాలు..

మార్చి 15 నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది..

2021 ఏప్రిల్ 14 చివరి తేదీ

విద్యార్హతలు- పోస్టుల వారీగా విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి.

దరఖాస్తు ఫీజు : 100 రూపాయలు

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్


ఈ రెండిటిలో సెలెక్ట్ అయితే మంచి వేతనం కూడా ఉంటుంది...

పైన పేర్కొన్న వెబ్ సైట్ ను పూర్తిగా చదివిన అనంతరం ఆసక్తి కలిగిన విద్యార్థులు మరియు నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: