ఇకపోతే తెలంగాణలోని నిరుద్యోగులకు నెలకు 3వేలు ఇవ్వనున్నారు. దీనిపై కూడా కీలక ప్రకటన చేయనున్నారు. డబుల్ బెడ్రూంలు రాని వారు సొంతంగా స్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం రూ.5 లక్షలు ఆర్థికసాయం చేయనుంది. ఇవే కాకుండా ఉద్యోగులకు పీఆర్సీ మీద కూడా సీఎం కేసీఆర్ ప్రకటన చేయనున్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బంది కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేస్తోంది. కరోనా వల్ల ఆర్థిక రాబడి తగ్గిపోయింది. దీన్ని రాబట్టుకోవడానికి ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. రిజిస్ట్రేషన్లు మళ్లీ పెరిగేలా ప్రోత్సహిస్తోంది. జీఎస్టీ, వ్యాట్, ప్రాపర్టీ, వాహనాల రిజిస్ట్రేషన్ లు పెరుగుతున్నాయి.
మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ఏరులై పారుతుంది.. దీంతో అటుగా లాభాలను కూడా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.ఫిబ్రవరి నాటికి రూ.15,000 కోట్ల ఆదాయం కేవలం లిక్కర్ ద్వారా లభించింది. ఇతరత్రా ఆదాయాలు అన్నీ కలిపి రూ.50,000 కోట్లకు చేరింది. మార్చి నెలలో కనీసం మరో రూ.10,000 కోట్లు అదనంగా రాబట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక. ఇక భూముల విక్రయం ద్వారా కూడా రెవిన్యూ రాబట్టాలనేది ప్రభుత్వం ముందున్న ప్లాన్.. ఈ విషయం పై బడ్జెట్ లో ఎక్కడైనా ప్రవేశ పెట్టక పోయిన కూడా ఇది కూడా ఒక అంశంగా చెప్పవచ్చు.. మొత్తానికి యువతకు మంచి గుడ్ న్యూస్ ను అందించింది.