సీబీఎస్ఈ పరీక్షలకు సంబంధించి ఇటీవలే కొన్ని మార్పులు చేస్తూ కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేసారు. ఇప్పుడు కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐసీఎస్ఈ) సైతం 10, 12 తరగతుల పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ప్రకటనను సోమవారం బోర్డు విడుదల చేసింది. పలు కారణాల రిత్యా 10వ తరగతి ఎగ్జామ్స్ ను మే 13, 15 తేదీల్లో నిర్వహించబోమని సీఐసీఎస్ఈ తెలిపింది. ఈ ఏడాదిలో పదో తరగతి లో జరగనున్న పరీక్షలకు సంబందించి మార్పులు చేర్పులు జరిగాయి.


మే 13న జరగాల్సిన (ఎకనామిక్స్ గ్రూప్-2 ఎలెక్టివ్) పరీక్షా మే 4వ తేదీన జరుగుతుందని తెలిపింది. మే 15న గతంలో విడుదలైన షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్న ఆర్ట్ పేపర్-2(నేచర్ డ్రాయింగ్, పెయింటింగ్) పరీక్షను వాయిదా వేశారు.మే 22న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్ట్ పేపర్-3(ఒరిజినల్ కంపోజిట్), ఆర్ట్ పేపర్-4 (అప్లైడ్ ఆర్ట్) పరీక్షలు ముందుగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం మే 22, మే 29 తేదీల్లో జరగాల్సి ఉంది. అయితే ఆ పరీక్షలను మే 29, జూన్ 5 కు వాయిదా వేశారు.


ఐఎస్‌సీ వెల్లడించిన రివైజ్డ్ టైమ్ టేబుల్ ప్రకారం.. ముందుగా వెల్లించిన షెడ్యూల్ ప్రకారం మే 5న బిజినెస్ స్టడీస్ పరీక్ష జరగాల్సి ఉంది. ఈ పరీక్షను జూన్ 18కి వాయిదా వేశారు. మే 13న జరగాల్సి ఉన్న ఇంగ్లిష్ పేపర్2ను మే 4కు, జూన్ 2న జరగాల్సి ఉన్న ఆర్ట్ పేపర్5ను మే 5కు, మే 15న జరగనున్న ఉన్న హోమ్ సైన్స్(పేపర్ 1)ను మే 22కు, జూన్5న జరగాల్సి ఉన్న ఆర్ట్ పేపర్ 4ను జూన్ 2కు, జూన్ 8న జరగాల్సి ఉన్న హాస్పటాలిటీ మేనేజ్మెంట్ పరీక్షను జూన్ 5కు, జూన్ 10న జరగాల్సి ఉన్న బయోటెక్నాలజీ(పేపర్ 1) పరీక్షను మే 8న, జూన్ 12న నిర్వహించాల్సి ఆర్ట్ పేపర్ ను 1 పరీక్షను మే 12న జరిపించనున్నట్లు ప్రకటించారు. సిలబస్ పూర్తి కావడంలో ఆలస్యం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: