ఈ నోటిఫికేషన్ లో మొత్తం ఖాళీలు 70 ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో ప్రాజెక్టు ఇంజనీర్ విభాగం లో 55 పోస్టులు, ప్రాజెక్ట్ ఆఫీసర్ విభాగంలో 15 పోస్టులు ఉన్నాయి.అభ్యర్థులు తప్పనిసరిగా బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/సీఏ/ఐసీడబ్ల్యూఏ/బీఎస్సీ/ఎంబీఏ/పీజీడిప్లొమా/ఎమ్ ఎస్ ఎమ్ విద్యార్హతలు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. ఇతర వివరాలకు నోటిఫికేషన్ చూడొచ్చు. అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లకు మించకుండా ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాల కు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 30 వేల నుంచి రూ. 33 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.36 వేల నుంచి రూ.39 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన విద్యార్థులు మరియు నిరుద్యోగులు కంపెనీ వెబ్ సైట్ bdl-india.in వెబ్ సైట్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి మార్చి 31 వరకు ఉంది. అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఏమైనా సందేహాలుంటే hrcorp-careers@bdl-india.inకు ఈ మెయిల్ చేయాలని ప్రకటనలో సూచించారు.
ఇక అభ్యర్థుల ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది..
ఈ నోటిఫికేషన్ వల్ల కొంత వరకు అయిన నిరుద్యోగ సమస్య తీరుతుందని సంస్థ వెల్లడించింది..