ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు కియా మోటార్స్ సంస్థ ఒక శుభవార్త ను చెప్పింది. కార్ల ఉత్పత్తి కి ప్రస్తుతం పేరుగాంచిన కియా సంస్థ తన కంపెనీ లో పలు పోస్టులను భర్తీ చేయడం కోసం,  నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆశిస్తోంది . అందులో భాగంగానే  ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC)  వారు ఈ నెల 16న కృష్ణా జిల్లా లోని గుడ్లవల్లేరు లోని gudlavalleru Engineering college లో ఇంటర్వ్యూలు నిర్వహించబోతోన్నట్లు తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 200 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే  ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు అనంతపురం జిల్లాలో  పెనుగొండ లోని కియా కార్ల కంపెనీ లో పని చేయాల్సి ఉంటుంది.



దిగ్గజ సంస్థ అయినటువంటి కియా కార్ల కంపెనీ neem TRAINEE విభాగములో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో డిప్లమా ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రెషర్స్ తో పాటు అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ పోస్టులకు  కేవలం పురుషులు మాత్రమే అర్హులు.  అభ్యర్థులు 18-25 ఏళ్ళ మధ్య వయసు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం రూ.14 వేల నుంచి రూ.15 వేల వరకు చెల్లిస్తారు.


ఇంటర్వ్యూ వివరాలు:
ఈ పోస్టుల వివరాలకు సంబంధించి ఈనెల 16న ఉదయం 9 గంటలకు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులు ఆన్లైన్లో పరీక్ష రాయవలసి ఉంటుంది. కాబట్టి అర్హత,ఆసక్తిగల అభ్యర్థులు ప్రిపరేషన్తో పోవడం మంచిది. ఇతర వివరాల కొరకు  8074370846, 9848819682, 7981938644 నెంబర్లను సంప్రదించవచ్చు.


ప్రస్తుత కాలంలో కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది నిరాశ్రయులయ్యారు. చాలా మంది ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాన్ని కోల్పోయి, నిరుద్యోగులుగా మారారు. కాబట్టి ఇలాంటి వారికి ఇది ఒక సదవకాశం అని,  సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC)  వారు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: