తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు.. ముఖ్యంగా నిరుద్యోగుల సమస్యలను తీర్చడానికి కొత్త అవకాశాలను కల్పిస్తున్నారు..పలు విభాగాల్లో ఉన్న నోటిఫికేషన్ కు సంబందించిన ఖాళీలను తెలుపుతూ విడుదల చేశారు. ఇప్పుడు కూడా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసారు. నిరుద్యోగులకు మరో శుభవార్త ను అందించింది. నిరుద్యోగులకు వరంగల్ లోని కేంద్రీయ విద్యాలయ శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.


పీజీటీ, టీజీటీ, పీఆర్టీ, నర్స్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్పోర్ట్స్ కోచ్, ఎడ్యుకేషనల్ కౌన్సెలర్ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.


పీఆర్టీ: టెన్త్, ఇంటర్, డిప్లొమా, బీఈడీ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.21250 వరకు వేతనం చెల్లిస్తారు. ఎడ్యుకేషన్ కౌన్సెలర్: సైకాలజీలో బీఏ/బీఎస్సీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.26250 వరకు వేతనం చెల్లిస్తారు.

స్పోర్స్ట్ కోచ్: ఎంపీఈడీ, బీపీఈడీలో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.21250 వరకు వేతనం చెల్లిస్తారు..


ఇకపోతే పీజీటీ: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్ లో బీఈడీ, ఎమ్మెస్సీ, బీఈ/బీటెక్, ఎంసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.27,500 వరకు వేతనం చెల్లిస్తారు.
కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, బీఎస్సీ, పీజీ డిప్లొమా, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులు.అని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇంటర్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. హిందీ, ఇంగ్లిష్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 15 వేల పాటు వేతనం చెల్లించనున్నారు.


నర్సు: నర్సింగ్ లో డిప్లొమో చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. ఎంపికైన వారికి రోజుకు రూ. 750 చొప్పున చెల్లిస్తారు.
అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు https://warangal.kvs.ac.in/ వైబ్ సైట్ ను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అప్లై చేసుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: